Kabali 7 Years : తలైవా రజనీకాంత్ కబాలీకి 7 ఏళ్లు
సూపర్ స్టార్ కెరీర్ లో టాప్
Kabali 7 Years : నటుడిగా రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఏ పాత్రలోనైనా ఒదిగి పోయే మనస్తత్వం ఆయనది. యంగ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ చేసిన భిన్నమైన సినిమా. ఈ చిత్రం విడుదలై నేటితో ఏడు ఏళ్లవుతోంది. తమిళ సినిమాలో నాయకన్ సినిమా ఓ సెన్సేషన్. అలాంటి కథ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూశాడు రజనీకాంత్. ఈ సమయంలో పా రంజిత్ తలైవాను కలిశాడు. స్టోరీ వినిపించాడు. సూపర్ స్టార్ కు తెగ నచ్చింది.
Kabali 7 Years Story
వెంటనే ఓకే చెప్పాడు. అదే కబాలి(Kabali) చిత్రంగా వచ్చింది. జూన్ 2015లో సినిమాకు సంబంధించి దర్శకుడు ప్రకటన చేశాడు. రజనీతో సినిమా చేస్తున్నానని. అదే ఏడాది ఆగస్టు లో టైటిల్, పోస్టర్ రిలీజ్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సెన్సేషన్ క్రియేట్ చేసింది.
కబాలి చిత్రానికి సంబంధించి ప్రతి వార్త ఆసక్తిని రేపింది. అభిమానుల్లో మరింత ఉత్కంఠను రేపింది. మే 2016లో టీజర్ విడుదల చేశారు. అత్యధికంగా వీక్షించిన టీజర్ గా రికార్డు బ్రేక్ చేసింది. జూలై 22న విడుదలైంది కబాలి. తమిళం , హిందీ, తెలుగు, మలయాళం , తదితర భాషల్లో రిలీజ్ చేశారు కబాలీని. రజనీకాంత్ క్లాస్ పర్ ఫార్మెన్స్ తెగ నచ్చింది జనాలకు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. రూ. 500 కోట్లు కొల్లగొట్టింది కబాలి. మొత్తంగా పా రంజిత్ ప్రతిభకు దర్పణంగా నిలిచింది సినిమా.
Also Read : Bhagwant Mann Flags : సింగపూర్ లో శిక్షణకు పంజాబ్ టీచర్లు