Rowdy Boys : దిల్ రాజుకు మంచి సినిమాలు నిర్మిస్తాడని పేరుంది. కానీ ఆయన నిర్మించిన రౌడీ బాయ్స్(Rowdy Boys )మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే కాదు ఇటీవల తెలుగు సినిమా తన పరిధి దాటుతోంది.
విచ్చలవిడితనం అంతటా రాజ్యమేలుతోంది. సెన్సార్ బోర్డు అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోంది. ఇక ఇంటిల్లిపాది సినిమాలు చూసే కాలం పోయింది.
ఏదో ఒక ఇష్యూతో జనంలో చర్చల్లోకి తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఇక ఇటవల విడుదలైన పలు సినిమాల్లో హీరోయిన్లు మరింత రెచ్చి పోతున్నారు.
ఏకంగా ముద్దులతో ఠారెత్తిస్తున్నారు. శ్యామ్ సింగ రాయ్ మూవీలో ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి ఏకంగా నానితో కిస్ సీన్ లో నటించింది. ఇదంతా కెమెరా ట్రిక్ అని ఆ తర్వాత వివరణ ఇచ్చుకుంది.
ఇక తాజాగా దిల్ రాజు నిర్మించిన రౌడీ బాయ్స్ (Rowdy Boys )లో నిన్నటి దాకా పద్దతి కలిగిన అమ్మాయిగా పేరొందిన అనుపమ పరమేశ్వరన్ రెచ్చి పోయింది. దిల్ రాజు సోదరుడి తనయుడు ఆశిష్ రెడ్డితో ముద్దు సీన్లతో అదరగొట్టింది.
మొత్తంగా ఆమె ట్రోలింగ్ కు కూడా గురైంది. డబ్బుల కోసం ఇంతలా దిగజారాలా అంటూ నెటిజన్లు నిప్పులు చెరిగారు. తెలుగు సినిమాలే కాదు ఆహా ఓటీటీలో కూడా ముద్దులు హద్దులు దాటుతున్నాయి.
వెబ్ సీరీస్ ల పేరుతో విచ్చలవిడితనం రాజ్యమేలుతోంది. ఇందుకు సంబంధించి భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆహా ఓహో అంటూ యాంకర్ల మాటలు. చూసీ చూడలేక జనం కళ్లు మూసుకుంటున్నారు.
Also Read : పాజిటివ్ లుక్ తో సోనాలి హల్ చల్