MP Arvind Kavitha : క‌విత‌కు కుల అహంకారం త‌ల‌కెక్కింది

ఎమ్మెల్సీ పై నిప్పులు చెరిగిన బీజేపీ ఎంపీ

MP Arvind Kavitha : భార‌తీయ జ‌న‌తా పార్టీ , టీఆర్ఎస్ మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డుస్తోంది. ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల తూటాలు పేల్చుతున్నారు. ఎమ్మెల్సీ క‌విత కాంగ్రెస్ పార్టీతో ట‌చ్ లో ఉంద‌ని ఆరోపించారు ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు ఆ పార్టీ శ్రేణులు. ఆయ‌న ఇంటిపై శుక్ర‌వారం దాడికి దిగారు.

త‌న త‌ల్లిని బెదిరించార‌ని, కొంద‌రిపై చేయి చేసుకున్నారంటూ ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌శ్నిస్తే దానికి జ‌వాబు చెప్పాల్సింది పోయి దాడుల‌కు దిగ‌డం ఏం సాంప్ర‌దాయ‌మ‌ని నిల‌దీశారు ఎంపీ. కేసీఆర్, కేటీఆర్, క‌విత‌కు కుల అహంకారం త‌ల‌కెక్కింద‌ని మండిప‌డ్డారు.

త్వ‌ర‌లోనే వాళ్లు ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం ఖాయ‌మ‌న్నారు. త‌న ఇంట్లో విధ్వంసం సృష్టించి , త‌ల్లికి వార్నింగ్ ఇచ్చి, ఇత‌ర మ‌హిళ‌ల‌ను కొట్టే అధికారం ఎవ‌రు ఇచ్చారంటూ ప్ర‌శ్నించారు. క‌విత ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రించేందుకు ఇది దొర‌ల పాల‌న కాద‌న్నారు.

గుర్తుంచుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్. త‌న‌పై ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ద‌మ‌ని ఆమె చేసిన ప్ర‌క‌ట‌న‌ను తాను స్వీక‌రిస్తున్నాన‌ని అన్నారు. ద‌మ్ముంటే త‌న‌పై గెల‌వాల‌ని స‌వాల్ విసిరారు ఎంపీ(MP Arvind Kavitha). రాబోయే ఎన్నిక‌ల కోసం తాను ఎదురు చూస్తూ ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టికైనా త‌ను చెప్పిన మాట మీద నిల‌బ‌డితే మంచిద‌న్నారు. ఆమె ఇంత‌లా రెస్పాండ్ అయ్యిందంటే క‌చ్చితంగా కాంగ్రెస్ తో ట‌చ్ లో ఉన్న‌ట్లు అర్థం అవుతోంద‌న్నారు ఎంపీ అర‌వింద్.

ఏ కోర్టులో కేసు వేసినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు.

Also Read : ప్ర‌శ్నిస్తే దాడులు చేస్తారా – బండి సంజ‌య్

Leave A Reply

Your Email Id will not be published!