MP Avinash Reddy : బాబు తాను పులిన‌ని అనుకుంటే ఎలా

ఎంపీ అవినాష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

MP Avinash Reddy : ప్రాజెక్టుల‌పై ధ్యాస లేద‌ని, 12 వేల కోట్ల అవినీతికి ప్లాన్ వేశాడంటూ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై నిరాధార ఆరోప‌ణ‌లు చేసిన టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy). పులివెందులలో తానేదో పొడిచిన‌ట్లు మాట్లాడ‌టాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. బుద్ది లేకుండా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు ఎంపీ.

MP Avinash Reddy Comments

గురువారం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబుకు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. అస‌లు ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. బాబుకు వ‌య‌సు పెరిగే కొద్దీ విచ‌క్ష‌ణా జ్ఞానం నశిస్తున్న‌ట్లు అనిపిస్తోంద‌న్నారు. జ‌నం ఏ స‌భ‌లకైనా వ‌స్తార‌ని ఆ విష‌యం గుర్తు పెట్టుకుంటే మంచిద‌న్నారు. వాపు చూసి బ‌లుపు అనుకుంటే రాబోయే రోజుల్లో పుట్ట‌గ‌తులు లేకుండా పోతారంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

చంద్ర‌బాబు లాగే సీఎం జ‌గ‌న్ రెడ్డి ఆలోచించి ఉంటే కుప్పంను రెవెన్యూ డివిజ‌న్ చేసే వారా అని అవినాష్ రెడ్డి ప్ర‌శ్నించారు. నీ సొంత నియోజ‌క‌వ‌ర్గానికి కూడా నిధులు ఇచ్చిన ఘ‌న‌త త‌మ సీఎంకే ద‌క్కింద‌న్నారు. పొద్ద‌స్త‌మానం ఎదుటి వారి మీద రాళ్లు వేయ‌డం మానుకోవాల‌ని సూచించారు అవినాశ్ రెడ్డి. ఇక‌నైనా మారాల‌ని లేక పోతే ప్ర‌జ‌లు బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. త‌నంత‌కు తాను పులిన‌ని అనుకుంటున్నాడ‌ని కానీ ఆయ‌న పిల్లి కంటే అధ్వాన్న‌మ‌న్నారు.

Also Read : Canadian PM Divorce : కెనెడా పీఎం వీడిన బంధం

Leave A Reply

Your Email Id will not be published!