MP Dharmapuri Aravind : బండి ఉన్నప్పుడు గొడవలు జరిగేవి
ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్స్
MP Dharmapuri Aravind : భారతీయ జనతా పార్టీలో అసమ్మతి ఉందని మరోసారి తేలి పోయింది. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్బంగా అదే పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ, మాజీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
MP Dharmapuri Aravind Comments on Bandi Sanjay
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిత్యం గొడవలు జరిగేవన్నారు. కానీ ప్రస్తుతం కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి బీజేపీ చీఫ్ గా కొలువు తీరాక అలాంటి పరిస్థితి లేకుండా పోయిందని కితాబు ఇచ్చారు. మొత్తంగా ఇద్దరు ఎంపీల మధ్య ఆధిపత్య పోరు ఉందనేది స్పష్టమైంది. ఇదే సమయంలో తెలంగాణ సీఎం ఎవరనేది తాను కానీ, కిషన్ రెడ్డి కానీ నిర్ణయించరని స్పష్టం చేశారు.
పార్టీ హైకమాండ్ ఎవరు సరైన వ్యక్తులు అనేది ఆలోచిస్తుంది..నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా ధర్మపురి అర్వింద్(MP Dharmapuri Aravind) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలువరు సీనియర్లు బీజేపీకి గుడ్ బై చెబుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ సర్కార్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అర్వింద్. ప్రభుత్వం బీసీ బంధు కింద కులవృత్తులకు ఎన్ని డబ్బులు ఇస్తున్నారో తెలియదన్నారు.
Also Read : Chandrababu Naidu : ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలి