Gaurav Gogoi : కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. పార్లమెంట్ సాక్షిగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆధారాలు లేకుండా తాను మాట్లాడం లేదన్నారు. ఇన్నేళ్ల పాటు దేశం ఇబ్బందుల్లో ఉంటే, సమస్యలతో సతమతం అవుతుంటే ప్రధానమంత్రి విదేశాలలో ఎంజాయ్ చేసేందుకు వెళ్లారని ఆరోపించారు.
Gaurav Gogoi Comments about Modi Govt
కేవలం వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం తప్పితే ఈ దేశానికి మోదీ ప్రధానిగా చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో కాపాడుకుంటూ వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను గంప గుత్తగా అమ్మడమో లేదా లీజుకు ఇవ్వడమో చేస్తూ వచ్చారని గౌరవ్ గొగోయ్(Gaurav Gogoi) ఆరోపించారు.
గత కొన్ని నెలలుగా మణిపూర్ కాలి పోతోంది. అగ్నిగుండంగా మారింది. కానీ ప్రధాని మనసు కరగలేదన్నారు ఎంపీ. ఎలాంటి బాధ్యత తీసుకోలేదని మండిపడ్డారు. హోం శాఖ వైఫల్యంపై ఏమీ మాట్లాడలేదన్నారు. భారత్ లోకి చైనా చొరబాటుపై కూడా పెదవి విప్ప లేదని ఫైర్ అయ్యారు. హర్యానా లోని నూహ్ లో జరిగిన హింసపై ఏమీ మాట్లాడక పోవడం దారుణమన్నారు.
దీనికి తోడు ప్రశ్నించిన తమ నాయకుడు రాహుల్ గాంధీని ఎలా బయటకు పంపాలా అని ఆలోచిస్తున్నారంటూ ధ్వజమెత్తారు గౌరవ్ గొగోయి. వీటన్నింటికి సమాధానం ఇవ్వనందుకే భారత కూటమి మణిపూర్ ప్రజలకు జవాబుదారీ తనంతో సభ నుంచి వాకౌట్ చేసిందన్నారు ఎంపీ.
Also Read : Pawan Kalyan : శభాష్ పవన్ కళ్యాణ్ – ఎంవీఆర్ శాస్త్రి