Komatireddy Venkat Reddy : సభపై ఆంక్షలు తగదు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy : ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జన గర్జన సభకు హాజరుకాకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం మంచి పద్దతి కాదని స్పష్టం చేశారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జన గర్జన సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు ఎంపీ.
సభలు, సమావేశాలు, సదస్సులు ఎవరైనా పెట్టుకోవచ్చని దానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy). సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అన్నది ఎవరికీ శాశ్వతం కాదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న విషయం దొర మరిచి పోవడం దారుణమన్నారు ఎంపీ.
ఇప్పటికే ప్రజలు హాజరు కాకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టుల పేరుతో అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ప్రజలు ఊర్లు, మండలాల నుంచి స్వచ్చంధంగా తరలి వస్తున్నారని దానిని బీఆర్ఎస్ జీర్ణించుకోలేక పోతోందని ఆరోపించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ఇప్పటి వరకు తమ పార్టీకి చెందిన 1700కు పైగా వాహనాలను ఎక్కడికక్కడ నిలిపి వేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Also Read : Congress Shock : జన గర్జన సభకు అడ్డంకులు