MP Lakshman : సీఎం ఎంపిక బాధ్యత లక్ష్మణ్ కు
మధ్యప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలు అప్పగింత
MP Lakshman : న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీ హైకమాండ్ పీఎం మోదీ ఆదేశాల మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఊహించని మెజారిటీతో తిరిగి పవర్ లోకి వచ్చింది.
MP Lakshman Got Responsibilities
ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్న రెండు రాష్ట్రాలను కోల్పోయింది. ఆ రాష్ట్రాలలో రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ ఉంది. ఇక తెలంగాణలో హస్తం పార్టీ దుమ్ము రేపింది. టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ 64 సీట్లు కైవసం చేసుకుంది.
ఇదిలా ఉండగా మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సీఎం ఎంపిక వ్యవహారం తలనొప్పిగా మారింది బీజేపీకి. దీంతో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ రంగంలోకి దిగారు. దీంతో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
మోదీ ఆదేశాల మేరకు బీజేపీ జాతీయ హైకమాండ్ సంచలన నిర్ణయం ప్రకటించింది. తెలంగాన ప్రాంతానికి చెందిన ఎంపీ లక్ష్మణ్(MP Lakshman) కు సీఎం ఎంపిక బాధ్యత అప్పగించింది. హుటా హుటిన భోపాల్ కు ఆయన బయలుదేరారు.
Also Read : VC Sajjanar : బస్సులు కొంటాం జాబ్స్ భర్తీ చేస్తాం