MP Laxman : అప్పులు తెచ్చిండు ఆగం చేసిండు
రూ. 5 లక్షల కోట్లు ఎవరి కోసం
MP Laxman : భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో పాలన గాడి తప్పిందన్నారు. రూ. 5 లక్షల కోట్ల అప్పు తీసుకు వచ్చారని, వీటిని ఎవరి కోసం ఎందు కోసం ఖర్చు చేశారో చెప్పాలని ఎంపీ సీఎం కేసీఆర్ ను నిలదీశారు. తనకు ఎంపీగా ఛాన్స్ ఇచ్చినందుకు ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు. అప్పులు తెచ్చిండు..తెలంగాణను ఆగం చేసిండని ఆరోపించారు లక్ష్మణ్.
పార్లమెంట్ లో అన్ని పార్టీలకు మాట్లాడేందుకు అవకాశం లభించిందన్నారు. ప్రతిపక్షాలు కావాలని అడ్డుకున్నాయని ఆరోపించారు. అసెంబ్లీ కంటే అక్కడే బెటర్ గా ఉందన్నారు లక్ష్మణ్(MP Laxman). తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను , రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా మార్చేశారంటూ మండిపడ్డారు.
నిధులన్నింటినీ ఇతర వాటికి ఖర్చు చేశాడని ఆరోపించారు. విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఫైర్ అయ్యారు లక్ష్మణ్. తాను రాజ్యసభలో హెచ్ఎంటీ భూములు పక్కదారి పట్టడాన్ని ప్రస్తావించానని చెప్పారు ఎంపీ. ఆవాస్ యోజన పథకాలకు సంబంధించి మంజూరైన నిధులను మళ్లించిన విషయాన్ని కూడా లేవదీశానని తెలిపారు.
తాను 15 ప్రశ్నలు అడిగానని, వాటికి లిఖిత పూర్వకంగా సమాధానం వచ్చిందని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. మోదీ ప్రధానమంత్రి కావడం వల్ల నిమ్న, బహుజన వర్గాలకు న్యాయం జరిగిందని తెలిపారు. పనికి ఆహార పథకం లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. రైతుల కోసం ప్రవేశ పెట్టిన ఫసల్ భీమా పథకాన్ని అమలు చేయకుండా అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు సీఎం కేసీఆర్ పై.
Also Read : బీఆర్ఎస్ అంతా బక్వాస్ – జగ్గారెడ్డి