Navneet Kaur : ఎంపీ, ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు

న‌వ‌నీత్ కౌర్ రాణా, ర‌వి రాణాకు గ్రాంట్ 

Navneet Kaur   : హ‌నుమాన్ చాలీసా వివాదం కేసులో అరెస్ట్ అయిన అమ‌రావ‌తి లోక్ స‌భ, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ స్వ‌తంత్ర ఎంపీ న‌వ‌నీత్ కౌర్(Navneet Kaur )రాణా, ఎమ్మెల్యే ర‌వి రాణాకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ థాక‌రే  ఇంటి వెలుప‌ల హనుమాన్ చాలీసా పారాయ‌ణం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు ఆందోళ‌న చేప‌ట్టిన ఎం, ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ చేసి కోర్టుకు త‌ర‌లించారు. వారిపై లా అండ్ ఆర్డ‌ర్ కు భంగం క‌లిగించేలా చేశారంటూ కేసు న‌మోదు చేశారు. ఈ త‌రుణంలో కోర్టు పోలీస్ క‌స్ట‌డీకి అనుమ‌తించింది.

దీంతో త‌మ‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ వారు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన ముంబై కోర్టు బుధ‌వారం ఎంపీ, ఎమ్మెల్యేల‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

దేశ ద్రోహం, శ‌త్రుత్వాన్ని ప్రోత్స‌హించ‌డం , విధుల‌ను నిర్వ‌ర్తించ‌నీయ‌కుండా నిరుధించేందుకు ప్ర‌భుత్వ ఉద్యోగిపై దాడి చేయ‌డం వంటి అభియోగాలు ఎంపీ న‌వ‌నీత్ కౌర్ రాణా, ఎమ్మెల్యే ర‌వి రాణాపై ఎఫ్ ఐ ఆర్ లో నిందితులుగా పేర్కొన్నారు.

ఏప్రిల్ 24న బాంద్రా కోర్టు ఎంపీ, ఎమ్మెల్యేల‌ను 14 రోజుల పాటు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీకి పంపింది. ఇదిలా ఉండ‌గా ఇవాళ ముంబైలో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

మ‌సీదుల‌లో లౌడ్ స్పీక‌ర్లు తొల‌గించాల‌ని మ‌హారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక‌రే ప్ర‌భుత్వానికి డెడ్ లైన్ విధించారు. ఈనెల  3 వ‌ర‌కు ప‌ర్మిష‌న్ ఇస్తామ‌ని 4 నుంచి ఇక వేచి చూడ‌మ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఈ త‌రుణంలో వీరిద్ద‌రికీ బెయిల్ రావ‌డం విశేషం.

Also Read : క‌న్న‌డ నాట బొమ్మైకి ఢోకా లేదు

Leave A Reply

Your Email Id will not be published!