MP Raghav Chadha : ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై ఆప్ గుస్సా
రాజ్యసభ చైర్మన్ కు రాఘవ్ లేఖ
MP Raghav Chadha : ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరకంగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(MP Raghav Chadha). ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ , దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ కు సుదీర్ఘ లేఖ రాశారు.
MP Raghav Chadha Written
ఇప్పటికే భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం తీవ్రంగా తప్పు పట్టిందని, కేవలం లా అండ్ ఆర్డర్ మాత్రమే ఢిల్లీలో కొలువు తీరిన లెఫ్టినెంట్ జనరల్ కు మాత్రమే పవర్స్ ఉంటాయని స్పష్టం చేసిందన్నారు. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఎంపీ రాఘవ్ చద్దా.
ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఈ ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టాయని కానీ పట్టించుకోక పోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బిల్లు పాస్ కావాలంటే పార్లమెంట్ లోని ఉభయ సభలలో ఆమోదం పొందాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించి చూస్తే లోక్ సభలో సభ్యుల సంఖ్య భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలకు ఎక్కువగా ఉన్నాయి. కాగా రాజ్యసభలో అధికార పక్షానికి ఆశించిన సంఖ్య లేదు. దీంతో వీగి పోయేందుకు వీలుంది. అయినా కావాలని కేంద్రం ముందుకు వెళ్లడం దారుణమని పేర్కొన్నారు ఎంపీ రాఘవ్ చద్దా.
Also Read : Kakani Govardhan Reddy : ఆర్బీకేలు దేశానికి ఆదర్శం – కాకాణి