Sanjay Raut : ఫడ్నవీస్ వల్లే మరాఠా సంక్షోభం – రౌత్
నిప్పులు చెరిగిన శివసేన ఎంపీ
Sanjay Raut : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు.
మోదీ, అమిత్ షా కావాలని మరాఠాలో సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నం చేశారని ఇందుకు ప్రధాన కారకుడు బీజేపీ చీఫ్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అని ఆరోపించారు.
ముందు నుంచీ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ఉండడం సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేయడం బీజేపీకి ప్రధానంగా ఫడ్నవిస్ కు మింగుడు పడలేదన్నారు. అందుకే కుట్ర పన్ని ఇలా సంక్షోభంలోకి నెట్టి వేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సంక్షోభంలో ఆయన జోక్యం చేసుకోకుండా ఉంటే తామేంటో నిరూపిస్తామని సవాల్ విసిరారు. 2019లో అజిత్ పవార్ తన పార్టీ శివసేన, కాంగ్రెస్ పార్టీలతో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో కూడా ఫడ్నవిస్ తో జత కట్టారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు సంజయ్ రౌత్.
ఇదిలా ఉండగా ఉద్దవ్ ఠాక్రే నాయకత్వానికి వ్యతిరేకంగా శివసేన సీనియర్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే తో పాటు 21 మంది ఎమ్మెల్యేలను తన వెంట తీసుకు వెళ్లడంతో దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా వినిపించింది.
విచిత్రం ఏమిటంటే షిండే రెబల్స్ టీం అంతా మొదట గుజరాత్ లోని సూరత్ హోటల్ లో ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా అస్సాం లోని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ లోకి మకాం మార్చారు.
ఆ రాష్ట్రం బీజేపీ కనుసన్నలలో ఉంది. ఇక ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ తమకు జాతీయ స్థాయి పార్టీ మద్దతు ఇస్తోందని చెప్పడం వెనుక ఫడ్నవీస్ పాత్ర ఉందన్నది సంజయ్ రౌత్(Sanjay Raut) ప్రధాన పాత్ర.
Also Read : నమ్మిన వాళ్లే నట్టేట ముంచారు – ఠాక్రే