MP Sanjay Singh : మ‌ణిపూర్ ఈ దేశంలో లేదా మోదీ

నిప్పులు చెరిగిన ఎంపీ సంజ‌య్ సింగ్

MP Sanjay Singh : ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఎంపీ సంజ‌య్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మ‌ణిపూర్ హింస‌పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నోరు విప్పాల‌ని ప‌దే ప‌దే డిమాండ్ చేయ‌డంతో రాజ్య‌స‌భ నుంచి ఈ శీతాకాల స‌మావేశాలు ముగిసేంత వ‌ర‌కు చైర్మ‌న్ వేటు వేశారు. దీంతో సంజ‌య్ సింగ్ గ‌త కొన్ని రోజుల నుంచి పార్ల‌మెంట్ భ‌వ‌నం ఆవ‌ర‌ణ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. నిర‌స‌న దీక్ష‌కు కూర్చున్న ఎంపీ జాతీయ మీడియాతో మాట్లాడారు.

MP Sanjay Singh Asking

మ‌ణిపూర్ గ‌త మే 3 నుంచి ర‌గులుతోంది. ఒక ర‌కంగా అగ్ని గోళంలా మండుతోంది. మ‌ణిపూర్ రాష్ట్రం ఈ దేశంలో లేదా అని నిల‌దీశారు ఎంపీ సంజ‌య్ సింగ్. ఇలా ఎంత కాలం మౌనంగా ఉంటారంటూ ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న హింస‌కు, అల్ల‌ర్ల‌కు, దారుణాల‌కు పూర్తి బాధ్య‌త వ‌హించాల్సింది కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాలేన‌ని పేర్కొన్నారు.

వెంట‌నే పాల‌నా ప‌రంగా వైఫ‌ల్యం చెందినందుకు మ‌ణిపూర్ స‌ర్కార్ ను, సీఎం బీరేన్ సింగ్ ను వెంట‌నే స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేశారు ఎంపీ సంజ‌య్ సింగ్. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మౌనం వీడేంత వ‌ర‌కు తాము పోరాటం చేస్తూనే ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించి ప్ర‌తిప‌క్షాల ఎంపీల‌తో కూడిన ఇండియా యుద్దం చేస్తుంద‌న్నారు.

Also Read : India MPs Protest : మోదీ ఇక‌నైనా నోరు విప్పు

 

Leave A Reply

Your Email Id will not be published!