MP Sanjay Singh : సస్పెండ్ చేసినా పోరాటం ఆపను
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఫైర్
MP Sanjay Singh : మణిపూర్ మండుతుంటే బాధ్యత కలిగిన సీఎం బీరేన్ సింగ్ , ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh). ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నియంతృత్వం ఎళ్లకాలం ఉండదన్నారు. కేంద్రం కావాలని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తనను ఎందుకు రాజ్యసభ చైర్మన్ సస్పెండ్ చేశారో ఆయనకే తెలియదన్నారు. ప్రశ్నించడం నేరం ఎలా అవుతుందని నిలదీశారు.
MP Sanjay Singh Said
తాము ప్రజల తరపున వాయిస్ వినించడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించాడు. మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మణిపూర్ ను పట్టించు కోవడం లేదని ఆరోపించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం , రైతుల కనీస మద్దతు ధర పై 267 నోటీసును బీజేపీ అంగీకరిస్తుందా అని మండిపడ్డారు సంజయ్ సింగ్.
ఆనాడు సాగు చట్టాలను బలవంతంగా తీసుకు వచ్చారు. కేవలం మోదీ తన పరివారానికి, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేకూర్చేందుకు తీసుకు వచ్చారని ఆరోపించారు. రైతు ఉద్యమం ఏడాది పాటు కొనసాగింది. చాలా మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. చివరకు మోదీ తలవంచక తప్ప లేదన్నారు. దారుణాల గురించి ప్రశ్నించినందుకే తనను పార్లమెంట్ లో లేకుండా చేశారని ఫైర్ అయ్యారు.
Also Read : Bhupalapally Police Hats Off : హ్యాట్సాఫ్ భూపాలపల్లి పోలీస్