MP Sanjay Singh : కేంద్రం తీరుపై సంజయ్ సింగ్ ఫైర్
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు వీగి పోవడం ఖాయం
MP Sanjay Singh : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ నిప్పులు చెరిగారు. రాజ్యాంగ స్పూర్తికి , సమాఖ్యకు వ్యతిరేకంగా మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ ఢిల్లీ ప్రభుత్వంపై కావాలని కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. మణిపూర్ హింస, అల్లర్లపై నిలదీసినందుకు తనను సభలో లేకుండా చేశారని మండిపడ్డారు.
MP Sanjay Singh Asking
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ ప్రభుత్వ ఒత్తిడి మేరకే తనను సస్పెండ్ చేశారంటూ ఆరోపించారు. తమ ఆటలు సాగవని కేంద్రం పనిగట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం దారుణమన్నారు. ప్రస్తుతం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని ధ్వజమెత్తారు.
ఇందులో కేంద్రానికి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh). సోమవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ఒక బిల్లు పాస్ కావాలంటే పార్లమెంట్ లోని లోక్ సభ, రాజ్యసభలో మూడో వంతు ఓట్లు రావాల్సి ఉంటుందన్నారు.
లోక్ సభలో భారతీయ జనతా పార్టీకి , దానిని సపోర్ట్ చేస్తున్న పార్టీలకు సంబంధించి ఎంపీల సంఖ్యా బలం ఉన్నా రాజ్యసభలో దానికి అంత సీన్ లేదన్నారు. తప్పనిసరిగా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు వీగి పోవడం ఖాయమన్నారు.
Also Read : K Annamalai : డీఎంకే ప్రభుత్వం అవినీతిమయం