Sanjay Singh Modi : లైసెన్స్ ర‌ద్ద‌యినా అక్ర‌మ మైనింగ్

ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ ఆరోప‌ణ

Sanjay Singh Modi : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజ‌య్ సింగ్(Sanjay Singh) షాకింగ్ కామెంట్స్ చేశారు. 2014లో మైనింగ్ కు సంబంధించి లైసెన్సులు ర‌ద్ద‌యినా ప్ర‌ధాన మంత్రి మోదీ స‌పోర్ట్ తో అదానీ గ్రూప్ అక్ర‌మంగా మైనింగ్ జ‌రుపుతోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌న్నారు. కేవ‌లం అధికారాన్ని అడ్డం పెట్టుకుని అదానీ ఎలా మ్యానేజ్ చేస్తున్నారో దీనిని చూస్తే తెలుస్తుంద‌న్నారు ఎంపీ. లైసెన్సులు ర‌ద్ద‌యినా ఎలా మైనింగ్ చేస్తుందంటూ ప్ర‌శ్నించారు.

ఇది పూర్తిగా అక్ర‌మ‌మ‌ని , దీనిపై వెంట‌నే విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ వ్య‌వ‌హారం ఛ‌త్తీస్ గ‌ఢ్ లో బొగ్గు గ‌నుల తవ్వ‌కం కొన‌సాగుతూనే ఉంద‌న్నారు. మైనింగ్ విష‌యంలో మోదీ స‌ర్కార్ 2015లో తెచ్చిన చ‌ట్టాన్ని కూడా ఉల్లంఘించారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. యూపీఏ హ‌యాంలో ప్రైవేట్ కంపెనీల‌కు లైసెన్సులు ఇచ్చింది. వీటిపై ఆరోప‌ణ‌లు రావ‌డంతో సుప్రీంకోర్టు వాటిని ర‌ద్దు చేసింది.

దీని త‌ర్వాత ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన మోదీ ప్ర‌భుత్వం కొత్త చట్టం తీసుకు వ‌చ్చింద‌న్నారు ఎంపీ సంజ‌య్ సింగ్(Sanjay Singh Modi). ఈ చ‌ట్టం గౌతం అదానీ గ్రూప్ కు మేలు చేకూర్చేలా మారింద‌ని ఆరోపించారు. స‌ర్వోన్న‌త న్యాయ స్థానం తీర్పుకు విరుద్దంగా ప‌ర్సా, కంటా గ‌నుల్లో బొగ్గు త‌వ్వేందుకు మోదీ ఎలా అనుమ‌తి ఇచ్చారంటూ ప్ర‌శ్నించారు ఎంపీ. దీనిపై సీబీఐ, ఈడీతో వెంట‌నే ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని సంజ‌య్ సింగ్ డిమాండ్ చేశారు. తాము కోర్టుకు వెళ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ.

Also Read : హ‌రీష్ సాల్వేపై మ‌హూవా ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!