Sanjay Singh : మణిపూర్ మండుతున్నా మోదీ మౌనం
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కామెంట్స్
Sanjay Singh : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ ఓ వైపు జాతుల మధ్య వైరంతో కాలి పోతోందని కానీ ఇప్పటి వరకు పీఎం స్పందించిన దాఖలాలు లేవన్నారు. కులం పేరుతో, మతం పేరుతో విద్వేష రాజకీయాలను ప్రోత్సహించే అలవాటు కాషాయ శ్రేణులకు మాత్రమే ఉందని సంచలన ఆరోపణలు చేశారు సంజయ్ సింగ్.
ఇప్పటి వరకు మణిపూర్ లో అల్లర్ల కారణంగా ఏకంగా 60,000 వేల మంది తమ ప్రాంతాలను విడిచి వెళ్లి పోయారని, వారంతా నిరాశ్రులయ్యారని ఆవేదన చెందారు . ఈ అల్లర్ల కారణంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని , 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. విధ్వంసాల కారణంగా రాష్ట్ర మహిళా మంత్రి, కేంద్ర మంత్రి ఇళ్లు దగ్దమయ్యాయని కానీ ఇప్పటి దాకా నరేంద్ర మోదీ ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం విడ్డూరంగా ఉందన్నారు ఎంపీ.
ఏకే 47, ఆధునిక ఆయుధాలు ఎలా అక్కడికి వస్తున్నాయంటూ సంజయ్ సింగ్(Sanjay Singh) ప్రశ్నించారు. ప్రధాని మౌనం వెనుక అర్థం ఏమిటని నిలదీశారు. నిరక్షరాస్యుడైన ప్రధాన మంత్రికి ఒకే ఒక్క ఎజెండా ఉందన్నారు. అదేమిటంటే కులాలు, మతాల పేరుతో విధ్వంసాలు సృష్టించడం లబ్ది పొందడం అంటూ మండిపడ్డారు.
Also Read : Dasoju Sravan : నా తండ్రి నాకు ఆదర్శం – శ్రవణ్