MP Sanjay Singh : విప‌క్షాలంటే మోదీకి భ‌యం

ఎంపీ సంజ‌య్ సింగ్ కామెంట్స్

MP Sanjay Singh : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజ‌య్ సింగ్ నిప్పులు చెరిగారు. గ‌త తొమ్మిది సంవ‌త్స‌రాలుగా న‌రేంద్ర మోదీకి, ఆయ‌న ప‌రివారానికి, బీజేపీకి ఎన్డీయే ఉంద‌న్న సోయి రాలేద‌న్నారు. కానీ ఎప్పుడైతే ప్ర‌తిప‌క్షాలు ఒక్క‌టి కావ‌డం మొద‌లు పెట్టాయో ఆనాటి నుంచి ప్ర‌ధాని మోదీలో వ‌ణుకు మొద‌లైంద‌న్నారు సంజ‌య్ సింగ్.

MP Sanjay Singh Said

గ‌తంలో ఏనాడూ సంకీర్ణ స‌ర్కార్ లో భాగ‌స్వాములుగా ఉన్న పార్టీల‌ను పిలువ లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేవ‌లం అవ‌కాశవాద రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తూ , కులం పేరుతో, మ‌తం పేరుతో, విద్వేషాల పేరుతో ఇంత కాలం నెట్టుకుంటూ వ‌చ్చార‌ని ధ్వ‌జ‌మెత్తారు ఆప్ ఎంపీ.

కానీ ఇప్పుడు జ‌నం మోదీ చెబితే న‌మ్మే స్థితిలో లేర‌న్నారు సంజ‌య్ సింగ్(Sanjay Singh). ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను మ‌రిచి పోయాడ‌ని, ద్ర‌వ్యోల్బ‌ణం , నిరుద్యోగం మ‌రింత పెరిగింద‌న్నారు. కానీ మోదీ మాత్రం విదేశీ టూర్లు మాత్రం జోర్దార్ గా చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌ల‌కు చెందిన ప్ర‌భుత్వ ఖ‌జానాను లూటీ చేస్తున్న మోదీకి గుణ‌పాఠం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్నార‌ని రాబోయే ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి విజ‌యం సాధించ‌క త‌ప్ప‌ద‌న్నారు సంజ‌య్ సింగ్.

కావాల‌ని ప‌దే ప‌దే కేంద్రం అడ్డుపుల్ల వేస్తోంద‌ని ఆరోపించారు సంజ‌య్ సింగ్. ఢిల్లీపై పెత్త‌నం చెలాయించేందుకు నానా తంటాలు ప‌డింద‌ని, కేంద్రం తీరుపై భార‌త స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు కూడా త‌ప్పు ప‌ట్టినా బుద్ది రాలేద‌న్నారు ఎంపీ.

Also Read : Vijaya Sai Reddy : టీడీపీకి అంత సీన్ లేదు

Leave A Reply

Your Email Id will not be published!