Sanjay Singh : మోదీ మౌనం దేశానికి శాపం

మోదీ మౌనం దేశానికి శాపం

Sanjay Singh : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు ఆప్ యూపీ ఎంపీ సంజ‌య్ సింగ్. పార్ల‌మెంట్ లో ప‌దే ప‌దే మ‌ణిపూర్ లో చోటు చేసుకున్న దారుణాలు, హింస‌పై స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు రాజ్య‌స‌భ చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్. ఒకానొక స‌మ‌యంలో ఆయ‌న సంయ‌మ‌నం కోల్పోయారు. ప‌దే ప‌దే స‌భా వేదిక వ‌ద్ద‌కు రావ‌డం, స‌భ జ‌ర‌గ‌నీయ‌కుండా అడ్డుప‌డ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్ర‌తిపాద‌న మేర‌కు పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు పూర్త‌య్యేంత దాకా సంజ‌య్ సింగ్ ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Sanjay Singh AAP MP

దీనిపై 26 ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. ధ‌ర్నాకు దిగ‌డంతో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈ సంద‌ర్బంగా వేటుకు గురైన ఎంపీ సంజ‌య్ సింగ్(Sanjay Singh) మీడియాతో మాట్లాడారు. ఇవాళ మ‌ణిపూర్ లో ఏం జ‌రుగుతోంద‌నే దానిపై నేను ప్ర‌భుత్వాన్ని నిల‌దీశాను. ఒక బాధ్య‌త క‌లిగిన ఎంపీగా నాకు హ‌క్కు ఉంది. పార్టీ ప‌రంగా నేను బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్నాను.

అటు కేంద్రంలో అటు రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం నెల‌కొంది. కానీ ఇంత వ‌ర‌కు అల్ల‌ర్ల‌ను ఎందుకు కంట్రోల్ చేయ‌లేక పోతున్నారో చెప్పాల్సిన బాధ్య‌త మోదీపై లేదా అని నిల‌దీశారు ఎంపీ సంజ‌య్ సింగ్.

Also Read : CM KCR Raitu Bandhu : ధ‌ర‌ణి ఉంటేనే రైతు బంధు – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!