MP Sanjay Singh : కాంగ్రెస్ ఎంపీ సంజయ్ సింగ్ నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. దిగ్గజ వ్యాపార వేత్త గౌతమ్ అదానీకి లబ్ది చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
MP Sanjay Singh Slams Modi
ప్రధాన మంత్రి తొందరపాటు నిర్ణయం వల్ల ఇవాళ గుజరాత్ మొత్తం సిగ్గుతో తల దించుకుందన్నారు. ఆయన 2007 లో గుజరాత్ కు సీఎంగా ఉన్న సమయంలో అదానీతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఆనాడు రాష్ట్ర ప్రజలకు రూ. 2.25 చొప్పున యూనిట్ కు చెల్లిస్తూ 25 ఏళ్ల పాటు విద్యుత్ ఇస్తామని అదానీ కంపెనీ మోదీతో సంతకం చేసిందన్నారు
కాగా తను చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోలేక పోయారంటూ మోదీపై సీరియస్ అయ్యారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh). తన హామీని వెనక్కి తీసుకున్నాడని , గుజరాత్ సర్కార్ తో విద్యుత్ ధరను పెంచేందుకు మరోసారి ఒప్పందం చేసుకున్నాడంటూ ఆరోపించారు .
దీన్ని బట్టి చూస్తే బీజేపీ ప్రభుత్వం , ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ గౌతం అదానీ మిత్రుడు కాలేదని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు ఎంపీ సంజయ్ సింగ్. తాజాగా సింగ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : CM KCR Pensioners : కేసీఆర్ కోసం పెన్షన్ డబ్బుల విరాళం
