Shatrughan Sinha : దర్యాప్తు సంస్థల పేరుతో వేధింపులు
టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా
Shatrughan Sinha : ప్రముఖ నటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ, సీబీఐ, ఈడీని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపించారు. ఎంపీ మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న బీజేపీ నేతలపై కాకుండా కావాలని ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందంటూ మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
బీజేపీకి లొంగి ఉంటే ఎలాంటి కేసులు, అరెస్ట్ లు ఉండవని పేర్కొన్నారు. ఇదంతా కక్ష సాధింపు తప్ప మరొకటి కాదన్నారు శత్రుఘ్న సిన్హా(Shatrughan Sinha). రాబోయే రోజులలో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు ఎంపీ. ఇప్పటికే మార్పు మొదలైందని, కేవలం తాము మాత్రమే ఉండాలని మిగతా పార్టీలు ఉండ కూడదనే ఆలోచనలతో ప్రస్తుతం బీజేపీ కుట్ర పూరిత రాజకీయాలకు తెర లేపిందని ధ్వజమెత్తారు టీఎంసీ ఎంపీ.
వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ కేవలం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ వస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్దతి కాదన్నారు. ఈ మొత్తం దాడులను, వేధింపులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. త్వరలో ఇంటి బాట పట్టడం ఖాయమని జోష్యం చెప్పారు శత్రుఘ్న సిన్హా.
Also Read : Archana Joshi removed : రైలు ఘటన ఎఫెక్ట్ జీఎంపై వేటు