Tiruchi Siva : ఎంపీపై వేటు అప్రజాస్వామికం – తిరుచి శివ
ఇది రాచరిక పాలన కాదు
Tiruchi Siva : డీఎంకే ఎంపీ తిరుచి శివ షాకింగ్ కామెంట్స్ చేశారు. మణిపూర్ లో చోటు చేసుకున్న హింసకు పూర్తి బాధ్యత వహించాల్సింది సీఎం , పీఎం మోదీనేనని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి తమకు తోచిన రీతిలో పాలన సాగిస్తామంటే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. ఒక రాష్ట్రం తగలబడి పోతుంటే విదేశీ పర్యటనలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు తిరుచి శివ(Tiruchi Siva).
Tiruchi Siva Asking
ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. డీఎంకే ఎంపీ నిప్పులు చెరిగారు. ప్రశ్నించేందుకే పార్లమెంట్ ఉందని, ప్రశంసలు కురిపించేందుకు కాదని తెలుసు కోవాలన్నారు. ఏకపక్షంగా ఎవరూ మాట్లాడ కూడదు అనుకుంటే ఎలా అని నిలదీశారు తిరుచి శివ.
మణిపూర్ హింసపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభ సాక్షిగా సమాధానం చెప్పాలని కోరిన తోటి ఆప్ సభ్యుడు సంజయ్ సింగ్ పై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ వేటు వేయడాన్ని తప్పు పట్టారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు.
ప్రశ్నిస్తే వేటు వేయడం అంటే ప్రశ్నలకు జవాబులు చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అనుకోవాల్సి వస్తుందన్నారు. నిరంతరం ట్విట్టర్ లో స్పందించే ప్రధాన మంత్రికి , దేశాలు పట్టుకుని తిరగే మోదీకి గత మే నుంచి మండుతున్న మణిపూర్ ను సందర్శించేందుకు మనసు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
Also Read : Hanuman Beniwal : ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా – బేనివాల్