Varun Gandhi : అగ్నివీరుల కోసం పెన్షన్ వదులుకుంటా
ప్రకటించిన ఎంపీ వరుణ్ గాంధీ
Varun Gandhi : భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi) సంచలన ప్రకటన చేశారు. ఆయన మరోసారి కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. బీజేపీలో ఉన్నా ఆయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వస్తున్నారు. మొన్న రైతుల ఉద్యమానికి మద్దతు పలికారు.
ఇవాళ దేశ వ్యాప్తంగా యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఐదేళ్లు, ఆరేళ్ల కాల పరిమితి ఉన్నప్పుడు దేశ రక్షణ కోసం త్యాగాలు చేసే జవాన్లకు, అగ్ని వీరులకు కేవలం నాలుగు ఏళ్లు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు.
అయినా కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేదు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ను కూడా ఖండించారు. బార్బర్లుగా , కార్పెంటర్లుగా పని చేయొచ్చంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.
వరుణ్ గాంధీ ఉత్తర ప్రదేశ్ లోని ఫిలిభిత్ నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్ని వీరులకు పెన్షన్ హక్కు లేదు.
ఇది దారుణం. కాబట్టి తాను వారి కోసం తనకు వచ్చే పెన్షన్ హక్కులను వదులు కునేందుకు సిద్దంగా ఉన్నానంటూ వరుణ్ గాంధీ (Varun Gandhi) ప్రకటించారు.
ఇదిలా అగ్నిపథ్ స్కీం కింద ఎంపికైన అగ్నివీరులకు నెలకు రూ. 30, 000 వేలు ఇస్తారు. నాలుగో సంవత్సరం రూ. 40 వేలు అందజేస్తారు. కానీ ఎలాంటి పెన్షన్ సౌకర్యం ఉండదు. ఇది పూర్తిగా కాంట్రాక్టు పద్దతిన ఎంపిక చేస్తారు.
Also Read : రెబల్స్ కు డిప్యూటీ స్పీకర్ ఝలక్