MP Vijay Sai Reddy : ఆంధ్రప్రదేశ్ – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కీం స్కామ్ లో ప్రధాన నిందితుడు బాబేనని పేర్కొన్నారు. 45 ఏళ్లుగా ఆయన ఏనాడూ ప్రజా బలంతో గెలిచిన దాఖలాలు లేవన్నారు విజయ సాయి రెడ్డి.
MP Vijay Sai Reddy Comments on TDP Chief
చంద్రబాబు నాయుడు పాపం పండిందని పేర్కొన్నారు. ఆయనకు కరెక్టుగానే 7691 నెంబర్ కేటాయించారని స్పష్టం చేశారు. ఈ నెంబర్ ను కూడితే 7+6+9+1 = 23 నంబర్ వస్తుందన్నారు. దీని అర్థం ఏమిటంటే చంద్రబాబు రాజకీయ జీవితం ఈ ఏడాది 2023తో అంతం అవుతుందన్నారు.
తన పొలిటికల్ కెరీర్ ను తానే నాశనం చేసుకున్నాడని తెలిపారు. 2024 నుంచి రాజకీయ యువనికపై ఇక చంద్రబాబు నాయుడు కనిపించరంటూ జోష్యం చెప్పారు ఎంపీ విజయ సాయి రెడ్డి(MP Vijay Sai Reddy). ఈ సందర్బంగా దివంగత సీఎం, బాబు మామ గారైన నందమూరి తారక రామారావును ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇవాళ ఆయన ఆత్మ సంతోషించి ఉంటుందన్నారు. కారణం తనను నమ్మించి మోసం చేసిన ఘనుడు నారా చంద్రబాబు నాయుడు అంటూ ఆరోపించారు. కాలం ఎప్పుడూ ఒకే రీతిన ఉండదని, ఏదో ఒక రోజు పాపం పండక తప్పదన్నారు విజయ సాయి రెడ్డి.
Also Read : Siddarth Luthra : చంద్రబాబు ప్రాణానికి ముప్పు – లూథ్రా
