Vijay Sai Reddy : వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా ధీమా వ్యక్తం చేశారు. 30 పార్టీలతో కూడిన ఎన్డీయే ఢిల్లీలో కొనసాగుతోందన్నారు. ఇదే సమయంలో 24 పార్టీలతో కూడిన విపక్షాలు బెంగళూరులో సమావేశం అవుతున్నాయని కానీ రాబోయే ఎన్నికలలో తాము సత్తా చాటడం ఖాయమని జోష్యం చెప్పారు వైసీపీ ఎంపీ.
రాష్ట్రంలో జగన్ ఆధ్వర్యంలో జనరంజకమైన పాలన సాగుతోందన్నారు. ఇవాళ దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. మొత్తం 175 స్థానాలకు గాను మొత్తం స్థానాలను తాము గెలుచు కోవడం ఖాయమని జోష్యం చెప్పారు విజయ సాయి రెడ్డి. 2024లో ఢిల్లీకి వెళ్లే దారి ఏపీ ద్వారా వెళుతుందని స్పష్టం చేశారు.
తమ అవసరం కేంద్రానికి ఉంటుందని, ఇదే సత్ సంబంధాలు యధావిధిగా భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలిపారు వైసీపీ ఎంపీ(Vijay Sai Reddy). టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్ని వ్యూహాలు పన్నినా ఏపీ ప్రజలు వారిని నమ్మరని పేర్కొన్నారు. ఆ ఇద్దరికీ అంత సీన్ లేదన్నారు విజయ సాయి రెడ్డి.
ఇప్పటికే రాష్ట్రంలోనే కాదు యావత్ దేశానికి చెందిన టాప్ మీడియా సంస్థలన్నీ వైసీపీ తిరిగి పవర్ లోకి వస్తుందని ఇప్పటికే చెప్పాయని స్పష్టం చేశారు ఎంపీ.
Also Read : Fire Bhopal Delhi Vandebharat : వందే భారత్ కోచ్ లో ఉ 6గం మంటలు
