Vijaya Sai Reddy : పురందేశ్వరిపై విజయ సాయి రెడ్డి ఫైర్
అవినీతి సామ్రాట్ బాబుకు సపోర్ట్ ఎలా
Vijaya Sai Reddy : ఆంధ్రప్రదేశ్ – పీకలలోతు అవినీతికి పాల్పడి రాజమండ్రి జైలు పాలైన టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బీజేపీ స్టేట్ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఎలా మద్దతు పలుకుతుందని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి.
ట్విట్టర్ వేదికగా ఇవాళ ఆయన స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగి ఉన్నట్లయితే ఇలాంటి అవినీతి పరులకు మద్దతు పలికే వారు కాదని పేర్కొన్నారు. టీడీపీ బలహీనతలను వీర్రాజు తన పార్టీకి అనుకూలంగా మార్చుకునే వారని అన్నారు.
Vijaya Sai Reddy Slams Purandeswari
కానీ బావ (చంద్రబాబు) సారూప్యత సమస్య ఉత్పన్నం అయ్యేది కాదని అభిప్రాయపడ్డారు ఎంపీ విజయ సాయి రెడ్డి(Vijaya Sai Reddy). ఇదిలా ఉండగా నారా చంద్రబాబు నాయుడు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమిలో చేరేందుకు సంప్రదింపులు జరిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ.
చర్చలు జరిపిన విషయం భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కు తెలుసని, అందుకే చంద్రబాబు నాయుడును లైట్ గా తీసుకుందని స్పష్టం చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
తాను ఇంకా అమాయకుడినని చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. బావ, మరదలి మధ్య ఉన్న బంధం ఏమిటో ప్రజలకు తెలిసి పోయిందని సెటైర్ వేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
Also Read : Pendyala Srinivas : బాబూ..పెండ్యాల శ్రీనివాస్ ఎక్కడ