Unparliamentary Words : పార్లమెంట్ లో నోరు జారితే జాగ్రత్త
అన్ పార్లమెంటరీ భాష వద్దే వద్దు
Unparliamentary Words : ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలన్నదే భారత రాజ్యాంగం లక్ష్యం. కానీ ఏనాడో దానికి తూట్లు పొడిచారు పార్లమెంట్ (లోక్ సభ, రాజ్యసభ ) సభ్యులు.
ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం. వ్యక్తిగతంగా దూషించడం, మంత్రులపై నోరు పారేసు కోవడం పరిపాటిగా మారింది. ఒకానొక సమయంలో
వీరి ప్రవర్తనను, మాట తీరును, వాడుతున్న భాషను చూసి ప్రజలు తల దించుకున్న సన్నివేశాలు చాలానే ఉన్నాయి.
అభ్యంతరకర (అన్ పార్లమెంటరీ ) భాషను, పదాలను(Unparliamentary Words), మాటల్ని వాడడం ఇక నుంచి కుదరదని తేల్చింది పార్లమెంట్. ఈ మేరకు ప్రజా ప్రతినిధులకు ఏయే పదాలు వాడకూడదో తెలియ చేస్తూ ఓ బుక్ లెట్ ను తీసుకు వచ్చింది.
ఏ మాత్రం నోరు జారినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అంతే కాదు వారిపై వేటు కూడా పడుతుంది. ఇక విడుదల చేసిన బుక్ లెట్ (ప్రవర్తనా నియమావళి ) లో అవినీతి పరుడు, అసమర్థుడు, నాటకం, నటన, సిగ్గు లేదు, ధోకే బాజ్ వంటి పదాలు అస్సలు వాడకూడదు ఇక నుంచి.
వీటిని అభ్యంతరకరమైన పదాలుగా గుర్తిస్తారు. ఈ మేరకు తాజాగా లోక్ సభ సచివాలయం మార్గదర్శక నియమావళితో కూడిన బుక్ లెట్ ను
జారీ చేసింది. ఈ పదాలు ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్ సభ, రాజ్యసభలలో ఎంపీలు వాడ వద్దని హెచ్చరించింది.
వీటితో పాటు బ్లడ్ షెడ్ , బ్లడీ, బీ ట్రేడ్ , అషేమ్డ్ , అబ్యూస్డ్ , చీటెడ్ , చంచా, చంచాగిరి, కరప్ట్ , కవర్డ్ , క్రిమినల్ , క్రొకడైల్ , టియ్స్ , డ్రామా,
ఐవాష్ , హోలిగనిజం, హిపోక్రసీ, మిస్ లీడ్ , లై , అన్ ట్రూ , స్నూప్ గేట్ అన్న ఇంగ్లీష్ పదాలు ఇక నుంచి వాడ కూడదు.
ఇక హిందీకి సంబంధించి అసత్య, అహంకార్ , గూన్స్ , అప్ మాన్ , కాలా బజారీ , దలాల్ , దాదాగిరీ, బేచారా, బాబా కట్ ,లాలీ పాప్ , తదితర
పదాలు చాలా ఉన్నాయి. వాటిని వాడకూడదు.
Also Read : ముంబైని ముంచెత్తిన వర్షం