MS Swaminathan : హరిత పితామహుడు ఇక లేడు
కన్ను మూసిన ఎస్ . స్వామినాథన్
MS Swaminathan : తమిళనాడు – ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడిగా పేరు పొందిన ఎం ఎస్. స్వామినాథన్ గురువారం చెన్నైలో కన్నుమూశారు. ఆయనకు 98 ఏళ్లు. వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక మార్పులు తీసుకు రావడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. అధిక దిగుబడిని ఇచ్చే వరి రకాలను అభివృద్ది చేయడంలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు.
MS Swaminathan No More
దీని వల్ల దేశంలోని కోట్లాది మంది రైతులకు మేలు చేకూర్చేలా చేశాయి. ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు దోహద పడేలా చేసింది. శాస్త్రవేత్తగా వివిధ హోదాలలో పని చేశారు స్వామినాథన్(MS Swaminathan). ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ గా , ఐకార్ డైరెక్టర్ జనరల్ గా , భారత ప్రభుత్వ కార్యదర్శిగా, వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ , వ్యవసాయ శాఖలో ప్రిన్సిపల్ సెక్టరీగా పని చేశారు. యాక్టింగ్ డిప్యూటీ చైర్మన్ , సభ్యుడిగా పని చేశారు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ చైర్మన్ గా పని చేశారు.
2004లో రైతులపై జాతీయ కమిషన్ కు అధ్యక్షుడిగా నియమతిలయ్యారు. చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ను స్థాపించారు. 1987లో తొలి ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారు. ఆయన చేసిన కృషికి గాను కేంద్ర సర్కార్ పద్మశ్రీ, పద్మభూషణ్ , పద్మ విభూషణ్ అవార్డులను అందజేసింది.
రామన్ మెగసెసే , ఆల్బర్ట్ ఐన్ స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డుతో పాటు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. హెచ్ కె ఫిరోడియా అవార్డు, లాల్ బహదూర్ శాస్త్రి , ఇందిరా గాంధీ జాతీయ బహుమతి అందుకున్నారు. స్వామినాథన్ మృతి పట్ల ప్రధాన మంత్రి మోదీతో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : Rahul Dravid : అశ్విన్ ఆడతాడో లేదో చెప్పలేం