Mukhtar Abbas Naqvi : కేంద్ర మంత్రి పదవికి ‘నఖ్వీ’ రాజీనామా
ఉప రాష్ట్రపతి రేసులో ముఖ్తార్ పేరు
Mukhtar Abbas Naqvi : కేంద్ర మంత్రి వర్గంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఉప రాష్ట్రపతిగా ప్రస్తుతం ఉన్న వెంకయ్య నాయుడు పదవీ కాలం ముగుస్తుంది.
దీంతో ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఇంకా కొలిక్కి రాలేదు. అయితే నఖ్వీకి(Mukhtar Abbas Naqvi) చాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో తన పదవి నుంచి తప్పుకోవడం పార్టీ వర్గాలలో చర్చకు దారి తీసింది.
అంతే కాకుండా ఆయన రాజ్యసభ పదవీ కాలంలో నేటితో ముగుస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ పదవీ కాలం పొడిగించింది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం.
ఇదే సమయంలో పీయూష్ గోయల్ కు కూడా చాన్స్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఇవాళ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి రాజీనామా చేసే కంటే ముందు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ(PM Modi),
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah), బీజేపీ నేషనల్ చీఫ్ తో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం తన పదవికి రాజీనామా సమర్పించారు.
ఇదిలా ఉండగా దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీతో పాటు ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ నాథ్ సింగ్ కూడా పని చేశారు.
ఆదివాసీలకు చెందిన నాయకురాలు ద్రౌపది ముర్ముకు(Draupadi Murmu) రాష్ట్రపతి పదవి అభ్యర్థిగా ప్రకటించింది. ఇక ఇటీవల బీజేపీ బహిష్కృత నాయకురాలు నూపుర్ శర్మ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఇబ్బందిగా మారింది.
ఈ తరుణంలో ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురు కాకుండా ఉండేందుకు గాను ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి ఉప రాష్ట్రపతిగా చాన్స్ ఇవ్వాలని అనుకుంటోందని సమాచారం.
Also Read : మహూవా మోయిత్రాపై కేసు నమోదు