Mukul Rohatgi : మోదీ సర్కార్ కు ముకుల్ రోహత్గీ ఝలక్
ఏజీఏగా రాలేనంటూ ఆఫర్ తిరస్కరణ
Mukul Rohatgi : కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ తగిలిగింది. దేశంలో అత్యున్నతమైన పదవులలో అటార్నీ జనరల్ పోస్ట్ (ఏజీఏ). ఇదిలా ఉండగా ఏజీఏగా తిరిగి రావాలంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది మోదీ సర్కార్. అత్యున్నతమైన పోస్ట్ తనకు వద్దంటూ కుండ బద్దలు కొట్టారు ముకుల్ రోహత్గీ(Mukul Rohatgi).
67 ఏళ్ల వయసు కలిగిన ముకుల్ రోహత్గీ జూన్ 2017లో అటార్నీ జనరల్ పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో కేకే వేణుగోపాల్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇదే క్రమంలో వేణుగోపాల్ పదవీ కాలం దగ్గర పడుతోంది. దీంతో మరోసారి కేంద్రం ముకుల్ రోహత్గీని అటార్నీ జనరల్ గా తిరిగి రావాలంటూ కోరింది కేంద్ర ప్రభుత్వం.
అటార్నీ జనరల్ గా తిరిగి రావాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ముకుల్ రోహత్గీ తిరస్కరించారు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ప్రభుత్వ అత్యున్నత న్యాయవాది అయిన ఏజీఏ తిరిగి వస్తామని కేంద్రం చేసిన ప్రతిపాదనను సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ(Mukul Rohatgi) తిరస్కరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇప్పటి వరకు ఏజేఏగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నకేకే వేణుగోపాల్ పదవీ కాలం ఇప్పటికే ముగిసింది. కాగా ఆయన పనితీరుకు మెచ్చిన మోదీ బీజేపీ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. తాను వయస్సు రీత్యా పని చేయలేనంటూ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు.
సెప్టెంబర్ 30తో వేణుగోపాల్ పదవీ కాలం ముగియనుంది. ఆయన ఐదు సంవత్సరాల పాటు కేంద్రంలో ఉన్నత న్యాయాధికారి (ఏజీఏ) గా పని చేశారు.
Also Read : రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం