Mulayam Singh Yadav : ములాయంకు మెరుగైన చికిత్స
ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
Mulayam Singh Yadav : సమాజ్ వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్(Mulayam Singh Yadav) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆయన వయస్సు 82 ఏళ్లు. భారత దేశ రాజకీయాలలో కీలకమైన పాత్ర పోషించారు.
సుదీర్గ కాలం పాలు యూపీ రాజకీయాలను శాసించారు. ఆరోగ్యం సహకరించక పోవడంతో గత కొంత కాలంగా ఇంట్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం తనయుడు అఖిలేష్ యాదవ్ పార్టీకి చీఫ్ గా ఉన్నారు.
సడెన్ గా ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే గురుగ్రామ్ లోని ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం బాగా లేక పోవడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా తెలంగాణ సీఎం కేసీఆర్ అఖిలేష్ యాదవ్ కు ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇటీవలే ఆయన యూపీలో పర్యటించారు.
వేదాంత ఆస్పత్రిలో చేర్చడంతో పెద్ద ఎత్తున సమాజ్ వాది పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తరలి వస్తూనే ఉన్నారు. బలమైన బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ములాయం సింగ్ యాదవ్(Mulayam Singh Yadav) .
సమగ్ర నిపుణుల బృందం చికిత్స అందిస్తోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా ములాయం సింగ్ యాదవ్ గత ఆగస్టు 22 నుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
జూలైలో కూడా ఆయన ఆస్పత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తనయుడు అఖిలేష్ యాదవ్ , కోడలు డింపుల్ యాదవ్ , సోదరుడు శివ పాల్ సింగ్ యాదవ్ ఆస్పత్రిని సందర్శించారు.
Also Read : 5 నుంచి జై శంకర్ విదేశీ పర్యటన