Mulayam Singh Yadav : విషమంగానే ములాయం ఆరోగ్యం
మేదాంత తాజా బులిటెన్ విడుదల
Mulayam Singh Yadav : రాజకీయ దురంధురుడిగా పేరొందిన యూపీ మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ ఫౌండర్ ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ విషయాన్ని ఆదివారం ఆయన చికిత్స పొందుతున్న మేదాంత ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తాజాగా ములాయంకు సంబంధించి హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.
ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ములాయం సింగ్ యాదవ్(Mulayam Singh Yadav) కోలుకోవాలని అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. మరో వైపు ఆస్పత్రి వద్దకు ఎవరూ రావద్దని కోరారు కుటుంబీకులు. ఆయన తనయుడు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆస్పత్రిలోనే ఉన్నారు.
తన తండ్రి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకో వైపు కార్యకర్తల తాకిడి ఆస్పత్రికి పెరిగింది. దీంతో ఎవరూ రావద్దని అఖిలేష్ యాదవ్ విన్నవించారు. తన తండ్రికి మెరుగైన చికిత్స అందుతోందని , ఆందోళన పడవద్దని కోరారు. దీంతో ముందు జాగ్రత్తగా పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
యూపీలో ములాయం సింగ్ యాదవ్ కు(Mulayam Singh Yadav) ఎనలేని ఫాలోయింగ్ ఉంది. ఆయన అటు యూపీలో ఇటు దేశంలోని రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు. గత మూడు సంవత్సరాలుగా తీవ్రమైన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు ములాయం సింగ్ యాదవ్ . గత ఆగస్టు నెల నుంచీ పరిస్థితి మరింత విషమించింది. దీంతో మేదాంత ఆస్పత్రికి తరలించి చికిత్స చేపట్టారు.
ఆయన త్వరగా కోలుకోవాలని పీఎం మోదీ, సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్, యోగి ఆదిత్యానాథ్, మాజీ సీఎం మాయావతి కోరారు.
Also Read : పవార్ కామెంట్స్ పై బీజేపీ గరం గరం