Mulayam Singh Yadav : ఐసీయూలోనే ములాయం సింగ్

ప‌రిస్థితి కంట్రోల్ లోనే ఉంది

Mulayam Singh Yadav : స‌మాజ్ వాది పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాద‌వ్(Mulayam Singh Yadav) ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ప్ర‌స్తుతం మ‌రింత విష‌మించ‌డంతో ఐసీయూలో చేర్చారు. వేదాంత ఆస్ప‌త్రిలో చేర్చారు. గ‌త కొంత కాలం నుంచీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

ప‌రిస్థితి రోజు రోజుకు విష‌మంగా ఉంటోంద‌ని పేర్కొన్నారు మేదాంత ఆస్ప‌త్రి వ‌ర్గాలు. స‌మ‌గ్ర వైద్య నిపుణుల బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ములాయం సింగ్ యాద‌వ్ ను ప‌ర్య‌వేక్షిస్తోంది. ఆస్ప‌త్రి యాజ‌మాన్యం మంగ‌ళ‌వారం మాజీ సీఎంకు సంబంధించి ఆరోగ్య ప‌రిస్థితిపై హెల్త్ బులిటెన్ ను విడుద‌ల చేసింది.

ఇవాళ అధికారికంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది. ఆయ‌న ఆరోగ్యంపై స‌మాజ్ వాది పార్టీ కూడా త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా వేదిక‌గా తెలిపింది. ఇదిలా ఉండ‌గా ములాయం సింగ్ యాద‌వ్ వ‌య‌స్సు 82 ఏళ్లు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా పేరొందారు.

యూపీ రాజ‌కీయాల‌ను ఆయ‌న కొన్నేళ్ల పాటు ప్ర‌భావం చూపారు. గురుగ్రామ్ లోని మెదాంత ఆస్ప‌త్రి లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు త‌ర‌లించిన‌ట్లు ఎస్పీ పేర్కొంది. ములాయం సింగ్ జీ ఇంకా క్రిటిక‌ల్ గా ఉన్నారు. నిపుణుల టీం నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తోంది. సాధ్య‌మైనంత మేర చికిత్సలు అంద‌జేస్తోంద‌ని పేర్కొంది పార్టీ.

ఇదిలా ఉండ‌గా ములాయం సింగ్ యాద‌వ్(Mulayam Singh Yadav) త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, దీర్ఘాయుష్షు పొందాల‌ని తామంతా కోరుకుంటున్నామ‌ని స‌మాజ్ వాది పార్టీ కోరింది. కాగా మాజీ సీఎం ఆగ‌స్టు 22 నుండి మేదాంత ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read : అనిల్ దేశ్ ముఖ్ కు బెయిల్ మంజూరు

Leave A Reply

Your Email Id will not be published!