Mulayam Singh Yadav : గురుగ్రామ్ ఆస్పత్రి ఐసీయూకి ములాయం
అనారోగ్య పరిస్థితి మరింత విషమం
Mulayam Singh Yadav : ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ములాయం సింగ్ యాదవ్ ను హుటా హుటిన గురుగ్రామ్ ఆస్పత్రిలోని ఐసీయూ (ఇంటన్సివ్ కేర్ యూనిట్ ) కు తరలించారు.
ఇదిలా ఉండగా ములాయం సింగ్ యాదవ్(Mulayam Singh Yadav) గత కొన్ని వారాలుగా చికిత్స పొందుతున్నారు. కాగా ములాయం సింగ్ యాదవ్ ను గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రి లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి తరలించారు. మాజీ సీఎంకు ప్రస్తుతం 82 ఏళ్లు. గత కొన్ని సంవత్సరాలుగా బలహీనమైన ఆరోగ్యం కారణంగా చికిత్స పొందుతున్నారు.
ఆయన ఇంట్లోనే ఉంటూ వచ్చారు. ఆయన తనయుడు ఈసారి ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రచారం చేపట్టారు అఖిలేష్ యాదవ్. కానీ ఊహించని రీతిలో రెండోసారి యూపీలో బీజేపీ జెండా ఎగుర వేశారు సీఎం యోగి ఆదిత్యానాథ్. ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం బాగుండాలని కోరారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్.
తన ఆరోగ్య పరిస్థితి పై తాజాగా స్పందించారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆరోగ్యం బాగుండాలని దేవుడని ప్రార్తిస్థున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ వారం ప్రారంభంలో జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సులో అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) మూడోసారి పార్టీ చీఫ్ గా ఎన్నికయ్యారు. ఇది పదవి కాదని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆస్పత్రి వద్ద సమాజ్ వాది పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
Also Read : ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బావుండేది – ఖర్గే