Navneet Kaur : హనుమాన్ చాలీసా వివాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి ఎంపీ నవనీత్ కౌర్(Navneet Kaur) , ఎమ్మెల్యే రవి రాణా లకు సంబంధించిన కేసును ముంబైలోని ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేసింది. తాము ప్రజా ప్రతినిధులమన్న సంగతి మరిచి పోయారు. గీత దాటారు. కానీ దేశ ద్రోహం అన్నది ఇక్కడ కనిపించడం లేదని పేర్కొంది.
సీఎం ఉద్దవ్ థాకరే ఇంటి వెలుపల చాలీసా పఠిస్తామంటూ ఎంపీ, ఎమ్మెల్యేలు తమ అనుచర గణంతో వెళ్లారు. నానా హంగామా సృష్టించారు. దీంతో పోలీసులు వీరిని ఏప్రిల్ 23న అరెస్ట్ చేశారు.
కాగా ఎంపీ ఆమె భర్త రవి రాణా నిస్సందేహంగా భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన వాక్ స్వాతంత్ర రేఖను దాటారు అంటూ వ్యాఖ్యానించింది.
అయితే అవమానకరమైన లేదా అభ్యంతరకరమైన పదాలను వ్యక్తీకరించడం వారిపై దేశ ద్రోహ అభియోగాన్ని ప్రేరేపించేందుకు తగిన కారణం కాదని ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది.
బెయిల్ మంజూరు చేస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆర్. ఎన్. రోకడే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దశలో ప్రాథమికంగా భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 124ఏ (విద్రోహం) కింద అభియోగాలు దంపతులపై మోప లేదని కోర్టు తెలిపింది.
ముంబై పోలీసులు మాత్రం కోర్టు కు వారి బెయిల్ ను వ్యతిరేకించారు. వారు అమాయకంగా పైకి కనిపిస్తున్నా అల్లకల్లోలం సృష్టించేందుకు పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు.
లా అండ్ ఆర్డర్ విఫలమైందని వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని వారన్నారు. దీని వెనుక వేరే ఉద్దేశం ఉంది.
Also Read : పీకేపై నితీష్ కుమార్ ఫైర్