Munugodu Counting : మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ షురూ

భారీ ఎత్తున పోలీసుల మోహ‌రింపు

Munugodu Counting : దేశ వ్యాప్తంగా ఏడు చోట్ల‌..తెలంగాణ‌లోని మునుగోడు ఉప ఎన్నిక‌కు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. న‌ల్ల‌గొండ‌లోని ఎఫ్సీఐ గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంల‌ను తీసుకు వ‌చ్చారు. బ‌రిలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ , బీఎస్పీ ఉన్నా పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్యే జ‌రిగింది.

93.14 పోలింగ్ శాతం న‌మోదైంది. ఓ రికార్డు అని చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తం 2,41,805 ఓట‌ర్ల‌కు గాను 2,25,125 ఓట్లు పోల్ అయ్యాయి. 119 పోలింగ్ కేంద్రాలకు గాను 298 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది. ఇక కౌంటింగ్ ఆదివారం ఉద‌యం ప్రారంభ‌మైంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నిక‌ల సంఘం 250 మంది సిబ్బందిని నియ‌మించారు.

వీరిలో 100 మంది ఓట్ల‌ను లెక్కిస్తారు(Munugodu Counting) . మిగ‌తా 150 మంది ఇత‌ర వాటిని ప‌ర్య‌వేక్షిస్తారు. ముందు జాగ్ర‌త్త‌గా పోలీసులు 144వ సెక్ష‌న్ విధించారు. భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ వికాస్ రాజ్. ఇక మ‌ధ్యాహ్నం 1 గంట లోపు మునుగోడు ఉప ఎన్నిక‌కు సంబంధించి తుది ఫ‌లితం వెలువ‌డే అవ‌కాశం ఉంది.

మొద‌ట‌గా పోస్ట‌ల్ బ్యాలెట్ కు సంబంధించి 628 న‌మోద‌య్యాయి. వీటిని లెక్కించే ప్ర‌క్రియ‌లో నిమ‌గ్న‌మయ్యారు ఎన్నిక‌ల సిబ్బంది. ఇక ఒక్కో రౌండ్ లో ఓట్ల లెక్కింపు గంట లేదా గంట‌న్న‌ర పాటు కొన‌సాగే చాన్స్ ఉంది. మొద‌ట చౌటుప్ప‌ల్ మండ‌లాన్ని లెక్కించ‌నున్నారు.

మ‌రో వైపు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగిసిన వెంట‌నే ఎగ్జిట్ పోల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కు జై కొట్టాయి. భారీ ఎత్తున గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పాయి.

Also Read : మునుగోడులో మొన‌గాడు ఎవ‌రో

Leave A Reply

Your Email Id will not be published!