Munugodu By Poll : మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ స్టార్ట్
298 బూత్ లు 2 లక్షల 41 వేల ఓటర్లు
Munugodu By Poll : మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది(Munugodu By Poll). సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం నియోజకవర్గంలో 2 లక్షల 41 వేల 805 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 119 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రతి బూత్ కు వెబ్ కాస్ట్ తో అనుసంధానం చేశారు. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించింది ఈ ఉప ఎన్నిక. పట్టణ ప్రాంతాలలో తక్కువ పోలింగ్ బూత్ లు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఓటర్ల వారీగా చూస్తే చౌటుప్పల్ పురపాలిక సంఘం పరిధిలో 23,914 మంది ఓటర్లు ఉన్నారు.
చండూరు మున్సిపాలిటీలో 10,768 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. మండలాల వారీగా చూస్తే చౌటుప్పల్ మండలో 35 వేల 519 మంది ఓటర్లుండగా నారాయణపురం మండలంలో 36 వేల 400 , మునుగోడు మండలంలో 35 వేల 780 మంది ఓటర్లు ఉన్నారు.
చండూరు మండలంలో 22 వేల 741 మంది ఓటర్లు ఉండగా మర్రిగూడలో 28 వేల 309 మంది ఓటర్లు, నాంపల్లి మండలంలో 33 వేల 819 మంది ఓటర్లు ఉన్నారు. ఇక గట్టుప్పల మండలంలో 14 వేల 525 మంది ఓటర్లు ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేపట్టారు. 3 వేల మందికి పైగా పోలీసులు 20కి పైగా కేంద్ర బలగాలను మోహరించారు నియోజకవర్గంలో.
బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి, టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి, బీఎస్పీ నుంచి చారి బరిలో ఉన్నారు.
Also Read : మునుగోడు ఉప ఎన్నికపై ఉత్కంఠ