Munugodu TRS Win : మునుగోడులో కారు జోరు బీజేపీ బేజారు
10 వేలకు పైగా భారీ ఆధిక్యం
Munugodu TRS Win : మునుగోడులో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా చాటింది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. అధికార యంత్రాంగాన్ని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లను మోహరించింది. ప్రధానంగా కేసీఆర్ స్ట్రాటజీ పని చేసింది. మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు వ్యూహాలు వర్కవుట్ అయ్యాయి.
పోల్ మేనేజ్ మెంట్ అనేది ఈసారి బీజేపీ కంటే గులాబీ దళమే సక్సెస్ అయ్యిందని(Munugodu TRS Win) చెప్పక తప్పదు. కడపటి వార్తలు అందేసరికి ఒక్క మూడు, నాలుగు రౌండ్లు తప్పితే 1,2,5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు.
మధ్య లోనే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లి పోయారు. ఇది అధర్మ విజయమని ఆరోపించారు. ధనం, మద్యాన్ని పంపిణీ చేసి
గెలుపొందారంటూ మండిపడ్డారు. అయినా తాను నైతిక విజయం సాధించానంటూ తెలిపారు. ఇక 14 రౌండ్లు ముగిసే సరికి 10 వేలకు పైగా మెజారిటీని సాధించారు.
ఇక ప్రధాన పోటీదారుగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు. మొత్తం 2,25,192 ఓట్లు పోల్ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ లలో కూడా రెండు
పార్టీలకు ఓట్లు రావడం విశేషం. మొత్తంగా కేసీఆర్ కు ఇది ఆక్సిజన్ లాగా పని చేసిందని చెప్పక తప్పదు.
ఇక రౌండ్ల వారీగా చూస్తే 14వ రౌండ్ లో కాంగ్రెస్ కు 750 ఓట్లు, బీజేపీకి 5,553 , ప్రభాకర్ రెడ్డికి 6608 ఓట్లు వచ్చాయి. 13 వ రౌండ్ లో కాంగ్రెస్ కు 521,
బీజేపీకి 5406, టీఆర్ఎస్ కు 6940 ఓట్లు వచ్చాయి.
12వ రౌండ్ లో కాంగ్రెస్ కు 1803, బీజేపీకి 5449, టీఆర్స్ కు 7248 ఓట్లు వచ్చాయి. 11వ రౌండ్ లో కాంగ్రెస్ కు 1788 ఓట్లు, బీజేపీకి 5853 ఓట్లు, టీఆర్ఎస్ కు 7214 ఓట్లు రాగా 10వ రౌండ్ లో కాంగ్రెస్ కు 2401, బీజేపీకి 7010, టీఆర్ఎస్ కు 7306 ఓట్లు వచ్చాయి.
9వ రౌండ్ లో కాంగ్రెస్ కు 605, బీజేపీకి 6665, టీఆర్ఎస్ కు 7614 ఓట్లు , 8వ రౌండ్ లో కాంగ్రెస్ కు 907, బీజేపీకి 6088 ఓట్లు, టీఆర్ఎస కు 6620
ఓట్లు వచ్చాయి. 7వ రౌండ్ లో కాంగ్రెస్ కు 1664 ఓట్లు , బీజేపీకి 6803 ఓట్లు, టీఆర్ఎస్ కు 7202 ఓట్లు పోల్ అయ్యాయి.
6వ రౌండ్ లో కాంగ్రెస్ కు 1962 ఓట్లు, బీజేపీకి 5378 ఓట్లు, టీఆర్ఎస్ కు 6016 ఓట్లు వచ్చాయి. 5వ రౌండ్ లో కాంగ్రెస్ కు 2683 ఓట్లు , బీజేపీకి 5245
ఓట్లు, టీఆర్ఎస్ కు 6062 ఓట్లు పోల్ అయ్యాయి. 4వ రౌండ్ లో కాంగ్రెస్ కు 1817 ఓట్లు, బీజేపీకి 4555 ఓట్లు, టీఆర్ఎస్ కు 4854 ఓట్లు వచ్చాయి.
3వ రౌండ్ లో కాంగ్రెస్ కు 1926 ఓట్లు , బీజేపీకి 7426 ఓట్లు, టీఆర్ఎస్ కు 7390 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక 2వ రౌండ్ లో కాంగ్రెస్ కు 3697 ఓట్లు , బీజేపీకి
13748 ఓట్లు, టీఆర్ఎస్ కు 14199 ఓట్లు వచ్చాయి.
1వ రౌండ్ లో కాంగ్రెస్ కు 2100 ఓట్లు , బీజేపీకి 5126 ఓట్లు , టీఆర్ఎస్ కు 6418 ఓట్లు పోల్ అయ్యాయి.
Also Read : మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు