Munugodu Counting : రెండు రౌండ్ల‌లో టీఆర్ఎస్..బీజేపీ ఫైట్

పోస్ట‌ల్ బ్యాలెట్ల‌లో నువ్వా నేనా

Munugodu Counting : మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది(Munugodu Counting). మొద‌టగా పోస్ట‌ల్ బ్యాలెట్ల‌ను లెక్కించారు. మొత్తం 686 ఓట్ల‌కు గాను 228 ఓట్లు టీఆర్ఎస్ కు రాగా 224 ఓట్లు బీజేపీకి వ‌చ్చాయి. మిగ‌తా వారికి 80 ఓట్లు, బీఎస్పీ అభ్య‌ర్థి శంక‌రాచారికి 10 ఓట్లు పోల్ అయ్యాయి.

ఇదిలా ఉండ‌గా మొత్తం 2, 41, 805 ఓట్ల‌కు గాను 2,25,105 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 93.14 శాతం న‌మోదు కావ‌డం ఓ రికార్డ్. ఇక మండ‌లాల వారీగా చూస్తే చౌటుప్ప‌ల్ లో 55,678 ఓట్లు పోల్ అయ్యాయి. సంస్థాన్ నారాయ‌ణ‌పురంలో 34,157 ఓట్లు, మునుగోడులో 33,455 ఓట్లు, చండూరులో 31,333 ఓట్లు పోల్ అయ్యాయి.

ఇక గ‌ట్టుప్ప‌ల్ మండ‌లంలో 13,452 ఓట్లు , మ‌ర్రిగూడ‌లో 25,877 ఓట్లు, నాంప‌ల్లి 31,240 ఓట్లు పోల్ కాగా. ఇదిలా ఉండ‌గా మొద‌టి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి 5,126 ఓట్లు వ‌చ్చాయి.

ఇక టీఆర్ఎస్ కు 6,478 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి స్ర‌వంతి రెడ్డి 2,100 ఓట్లు పోల్ అయ్యాయి. తాజా స‌మాచారం మేర‌కు రెండో రౌండ్ లో బీజేపీ ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం. మొత్తంగా చూస్తే మునుగోడు ఉప ఎన్నిక ఫ‌లితం నువ్వా నేనా అన్న రీతిలో నెల‌కొంది.

మొద‌టి రౌండ్ లో గులాబీ హ‌వా చాటితే రెండో రౌండ్ లో క‌మ‌లం దుమ్ము రేపింది. ప‌ట్ట‌ణ ప్రాంతాల‌తో పాటు గ్రామీణ ప్రాంతాల‌లో కూడా బీజేపీకి ఓట్లు ప‌డ‌డం విస్తు పోయేలా చేసింది.

Also Read : మునుగోడు రిజ‌ల్ట్ పై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!