Munugodu Exit Polls : ‘గులాబీ’కి జై కొట్టిన ఎగ్జిట్ పోల్స్
మునుగోడులో టీఆర్ఎస్ దే జయం
Munugodu Exit Polls : దేశ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్న మునుగోడు ఉప ఎన్నిక ఎట్టకేలకు(Munugodu Exit Polls) ముగిసింది. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగింది ఈ పోటీ. ఇక్కడ వాస్తవానికి సీటు కాంగ్రెస్ పార్టీది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పదవికి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ను వీడారు. ఆపై కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధాన పార్టీలతో పాటు ఇతరులు కూడా బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పటి లాగే తన సంప్రదాయ ఓటు బ్యాంకును కోల్పోక పోవడం విశేషం.
గతంలో ఇక్కడ ఉన్న దివంగత నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డికి ఉన్న మంచి పేరు తన కూతురు స్రవంతి రెడ్డికి ప్లస్ అయినట్టుగా భావించ వచ్చు.
ఇక పార్టీ పరంగా సీనియర్లు ఎవరూ అంతగా ఇక్కడ ఫోకస్ పెట్టలేదనే చెప్పక తప్పదు. కోట్లాది రూపాయలు , లెక్కకు మించిన మద్యం, కేసులు, దాడులు, ఆరోపణలు ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష అవలక్షణాలు ఈ ఉప ఎన్నికలో మరోసారి బయట పడ్డాయి.
ఇక అధికార పార్టీ పూర్తిగా అధికారాన్ని, కేబినెట్ ను ఇక్కడ మోహరించింది. ఒక రకంగా ప్రతిష్టాత్మకంగా మారడంతో పాటు ఈ ఉప ఎన్నికను త్వరలో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించడంతో ప్రతిష్టాత్మకంగా మారింది.
భారీ ఎత్తున పోలింగ్ జరగడం కూడా టీఆర్ఎస్ కు లాభించిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ గంప గుత్తగా గులాబీ గెలుస్తుందని చెప్పడం విస్తు పోయేలా చేసింది.
Also Read : పోలింగ్ ముగిసింది ఫలితమే మిగిలింది