Bhuma Akhila Priya : మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్ పై హత్యాయత్నం

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్‌పై హత్యాయత్నం జరిగింది....

Bhuma Akhila Priya : మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ పై హత్యాయత్నం కేసు నుండి మరో ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అతనితో పాటు మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ షర్ఫుద్దీన్ తెలిపారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.

Bhuma Akhila Priya Case

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్‌పై హత్యాయత్నం జరిగింది. నిఖిల్ అఖిల ప్రియ ఇంటి బయట నిలబడి ఉండగా కారులో వచ్చిన పలువురు అతడిని ఢీకొట్టారు. ఆయుధాలతో ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. నిఖిల్ వారి నుండి పారిపోయి అఖిలప్రియ ఇంట్లోకి పరుగెత్తాడు. అయితే అప్పటికే నిఖిల్‌కు తీవ్రగాయాలు కావడంతో అతన్ని నంద్యాల ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Weather Alert : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

Leave A Reply

Your Email Id will not be published!