Murugha Mutt Seer : మురుగ మఠాధిపతికి 14 రోజుల కస్టడీ
బాలికలపై అత్యాచారం కేసు నమోదు
Murugha Mutt Seer : కర్ణాటకలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గ మురుగ మఠం మఠాధిపతిని కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల కస్టడీకి తరలించారు. మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావును సెప్టెంబర్ 1న రాత్రి అరెస్ట్ చేశారు.
నివాసంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. మఠాధిపతిని(Murugha Mutt Seer) జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ఇదిలా ఉండగా శివమూర్తి మురుగ శరణారావు గత మూడు రోజులుగా పోలీసు కస్టడీలో ఉన్నారు.
గత కొన్ని రోజుల నుంచి మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. మఠం నిర్వహణలోని పాఠశాలలో చదువుకుంటున్న వారిపై గత కొంత కాలం నుంచి లైంగికంగా వేధిస్తున్నారని వాపోయారు బాధిత బాలికలు.
అక్కడి నుంచి వారు నేరుగా ఓ సంస్థ సాయంతో పోలీసులను ఆశ్రయించారు. చిత్రదుర్గలో అయితే తమకు న్యాయం జరగదని మైసూరుకు వెళ్లారు.
దీంతో ఆయనపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. మురుగ మఠాధిపతిని సెప్టెంబర్ 14 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు.
ఈ మేరకు న్యాయమూర్తి ఆదేశాల మేరకకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మఠాధిపతి కస్టడీని పొడిగించాలని పోలీసులు కోరలేదు. కానీ రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వడం సంచలనం కలిగించింది.
కోర్టు విచారణ అనంతరం చిత్రదుర్గ జైలుకు తరలించారు మఠాధిపతిని. ఇవాళ మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మరో మఠాధిపతి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది.
ప్రస్తుతం కర్ణాటకలో లింగాయత్ సామాజిక వర్గం ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది.
Also Read : అర్ష్ దీప్ సింగ్ కు మంత్రి మద్దతు