Murugha Mutt Seer : మురుగ మఠాధిపతి నమూనాల సేకరణ
వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు
Murugha Mutt Seer : అత్యాచార ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో మురుగ మఠం మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పర్చగా కస్టడీకి తరలించారు.
విచారణకు సంబంధించి మఠాధిపతికి(Murugha Mutt Seer) సంబంధించిన రక్తం, వెంట్రుకల నమూనాలను సేకరించినట్లు నివేదిక పేర్కొంది. వైద్య పరీక్షలను చేయించారు. లైంగికంగా తమను వేధింపులకు గురి చేశారంటూ ఇద్దరు బాలికలు బయటకు వచ్చారు.
ధైర్యంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మఠాధిపతిని సెప్టెంబర్ 5 వరకు పోలీసు కస్టడీకి పంపారు. హైస్కూల్ చదువుతున్న మైనర్ బాలికలపై నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.
మురుగ మఠం అధిపతిగా ఉన్న శివమూర్తి మురుగ శరణారావుకు శనివారం చిత్రదుర్గ జిల్లా ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు నర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
పోలీసులు అతన్ని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కార్యాలయం నుండి గట్టి భద్రతతో జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అక్కడ అతన్ని విచారిస్తున్నారు.
దర్యాప్తు ప్రయోజనాల కోసం మఠాధిపతి రక్తం, జుట్టు నమూనాలను కూడా తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. పరీక్షల అనంతరం మళ్లీ విచారణ నిమిత్తం డిప్యూటీ ఎస్పీ కార్యాలయానికి తీసుకు వెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం మఠాధిపతికి 64 ఏళ్లు. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని అత్యంత ప్రముఖమైన, ప్రభావంతమైన లింగాయత్ మఠాలలో ఒకరైన మఠాధిపతిని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా నిష్పక్షపాతంగా మఠాధిపతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం సిద్దరామయ్య.
Also Read : రాష్ట్రపతిని కలిసిన రాఘవ్ చద్దా