Twitter Deal : మస్క్ ట్విట్టర్ డీల్ పునరుద్దరణ
ఇంకా కొనసాగుతున్న సస్పెన్స్
Twitter Deal : ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది ట్విట్టర్ డీల్(Twitter Deal) వ్యవహారం. ఇప్పటికే విద్యుత్ కార్ల రారాజుగా పేరొందిన టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ పై కన్నేశాడు. ఆపై $44 బిలియన్ల డీల్ కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత తనకు పూర్తి వివరాలు కావాలని కోరాడు.
ఆపై తాను ఒప్పందం నుంచి విరమించు కుంటున్నట్లు ప్రకటించాడు. ఆపై ట్విట్టర్ పై నోరు పారేసుకున్నాడు. అనంతరం సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలాడు. దీంతో చేసుకున్న ఒప్పందం మేరకు మోసం చేశాడంటూ తమకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ ట్విట్టర్ ప్రకటించింది.
ఈ మేరకు కోర్టును ఆశ్రయించింది. ఎవరు ముందు విరమించుకున్నా ఎలోన్ మస్క్ పరిహారం ఇవ్వాల్సిందేనంటూ పేర్కొంది. దీనిని సవాల్ చేస్తూ ఎలోన్ మస్క్ సైతం కోర్టు మెట్లు ఎక్కారు. అంతలోపు ఏమైందో ఏమో కానీ టెస్లా సిఇఓ, చైర్మన్ సంచలన ప్రకటన చేశాడు.
తిరిగి ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు తాను రెడీగా ఉన్నానంటూ ప్రకటించాడు. ఇదే విషయాన్ని ప్రముఖ సంస్థ బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. డీల్ ను పునరుద్దరించినట్లు ట్విట్టర్(Twitter Deal) అంతర్గత మెమోలో తెలియ చేసిందని పేర్కొంది. ఎలోన్ మస్క్ ట్విట్టర్ కు రాసిన లేఖలో ఈ ప్రతిపాదన చేసినట్లు స్పష్టం చేసింది.
అసలు ధర $54.20 కి కొనుగోలు చేసేందుకు బిడ్ ను పునరుద్దరించాడు. ఒప్పందం నుంచి వైదొలిగేందుకు వివాదాస్పద న్యాయ స్థాన పోరాటాన్ని తప్పించుకునే తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అంగీకరించిన ధరతో ఒప్పందాన్ని ముగించాలని భావిస్తున్నారు మస్క్.
Also Read : ట్విట్టర్ కొనుగోలుపై ఎలోన్ మస్క్ ఓకే