MVA MLAs Protest : అవినీతిపై నిరసన ఎమ్మెల్యేల ఆలాపన
షిండే సర్కార్ అవినీతిపై ఎంవీఏ ఆందోళన
MVA MLAs Protest : మరాఠా భగ్గుమంటోంది. ఓ వైపు కర్ణాటక, మహారాష్ట్ర మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. అటు అసెంబ్లీలో ఇటు విధాన మండలిలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే , డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ల మధ్య మాటల యుద్దం కొనసాగింది.
తాజాగా మరోసారి శివసేన బాల్ ఠాక్రే, కాంగ్రెస్ , ఎన్సీపీ లతో కూడిన మహా వికాస్ అఘాడీ కి చెందిన ఎమ్మెల్యేలు మంగళవారం నిప్పులు చెరిగారు. మహారాష్ట్ర షిండే, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు పెచ్చరిల్లాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు.
జానపద పాటలు పాడారు. అంతే కాదు మంజీరా వాయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రతి పనికి రేటు నిర్ణయించారంటూ ఆరోపించారు ఎంవిఏ ఎమ్మెల్యేలు(MVA MLAs Protest). దీని కారణంగా పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వాపోయారు. నాగ్ పూర్ లోని విధాన్ భవన్ కాంప్లెక్స్ లో పలువురు ఎమ్మెల్యేలు హల్ చల్ చేశారు.
ఇదే సమయంలో తాల్ అనే సంగీత వాయిద్యాన్ని వాయించడం ఆసక్తిని రేపింది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు మంగళవారం ప్రత్యేకంగా నిరసన తెలిపారు. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రుల అవినీతిపై భగ్గుమన్నారు. ఈ మేరకు జానపద పాటలతో హోరెత్తించారు.
Also Read : సీబీఐకి లైన్ క్లియర్