PM Modi : నా లక్ష్యం అవినీతి రహిత భారతం – మోదీ
అవినీతి కేసులపై ర్యాంకింగ్ అవసరం
PM Modi : అవినీతిని సహించను. దానిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు అవసరం. ఇక నుంచి కేంద్రంలో కీలకంగా ఉంటూ వస్తున్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎప్పటికప్పుడు కేసుల పురోగతిపై నివేదిక అందజేయాలని సూచించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi).
క్రిమినల్ కేసులను నిరంతరం పర్యవేక్షించాలని, ఇదే సమయంలో పెండింగ్ లో ఉన్న అవినీతి కేసుల ఆధారంగా ఆయా శాఖలకు ర్యాంకింగ్ లు ఇచ్చే విధానాన్ని రూపొందించాలని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి. నెల వారీగా లేదా త్రైమాసిక (మూడు నెలలు) ప్రాతిపదికన నివేదికలు తయారు చేయాలన్నారు.
గురువారం విజిలెన్స్ అవేర్ నెస్ వీక్ -2022 సందర్భంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థకు సంబంధించి పోర్టల్ ను ప్రారంభించారు నరేంద్ర మోదీ(PM Modi). అవినీతికి వ్యతిరేకంగా వ్యవహరించే ఏజెన్సీలు, అధికారులు తమ పనిని చేస్తున్న సమయంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు నరేంద్ర మోదీ.
అవినీతిపరులు ఎట్టి పరిస్ఙితుల్లోనూ తప్పించు కోకూడదన్నారు. వారికి రాజకీయ లేదా సామాజిక రక్షణ లభించదని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి. అవినీతికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా పేరుకు పోయిన వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు మోదీ.
చివరగా నా లక్ష్యం ఒక్కటేనని అవినీతి రహిత భారతమని ప్రకటించారు ప్రధాన మంత్రి. దేశంలో అవినీతిని పెంచి పోషించిన చరిత్ర గత పాలకులదేనని మండిపడ్డారు. ఆక్టోపస్ లాగా అల్లుకు పోయిందని దీనిని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు నరేంద్ర మోదీ.
Also Read : గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్