Myanmar Finance Crisis : ఆర్థిక సంక్షోభంలో మయన్మార్
శ్రీలంక పరిస్థితే కొనసాగుతోంది
Myanmar Finance Crisis : ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది శ్రీలంక. సేమ్ సీన్ ఇప్పుడు మయన్మార్(Myanmar Finance Crisis) ను తాకింది. ఇప్పటికే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల దోసి సైనిక పాలనలోకి వెళ్లింది.
దేశంలో స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయి. రాజకీయ పార్టీలను గృహ నిర్బంధంలోకి నెట్టేశారు. బాహ్య ప్రపంచానికి బంధం లేకుండా పోయింది. మరో వైపు ఆఫ్గనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు.
ఆర్థిక, ఆహార సంక్షోభం తట్టుకోలేక లక్షలాదిగా జనం రోడ్లపైకి వచ్చారు. రాజభవనంపై దాడికి పాల్పడ్డారు. పీఎం భయపడి ఆర్మీ క్యాంపులో దాక్కున్నాడు. మయన్మార్ విషయంలో ఇదే కొనసాగడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇక క్షీణిస్తున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకునేందుకు మయన్మార్ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల కంపెనీలు, వ్యక్తిగత రుణ గ్రహీతలను విదేశీ రుణాల చెల్లింపును నిలిపి వేయాలని ఆదేశించింది.
శ్రీలంక ఆర్థిక సంక్షోభం కారణంగా రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా జుంటా పాలిత మయన్మార్(Myanmar Finance Crisis) హింసాత్మకంగా పెరగడం, ఆర్థిక వ్యవస్థ తిరోగమనం కారణంగా ద్వీప దేశంలా మునిగి పోతోంది.
ఆంగ్ సాన్ సూకీ తండ్రి హత్య జరిగాక 75వ వార్షికోత్సవం సందర్భంగా మయన్మార్ అంతటా చెల్లా చెదురుగా ప్రజాస్వామ్య అనుకూలంగా నిరసనలు మిన్నంటాయి.
కరెన్సీ మరింత క్షీణించినా తర్వాత డాలర్ కు 2,400 చొప్పున విక్రయించబడింది. ఫిబ్రవరి 1, 2021న జరిగిన తిరుగుబాటుకు ఒక రోజు ముందు యుఎస్ డాలర్ తో పోలిస్తే క్యాట్ విలువ 1,340 వద్ద ఉంది.
దాని విలువ క్షీణించడంతో మయన్మార్ లో ఆహారం, ఇంధన ధరలు పెరిగాయి. అమెరికా జోక్యం చేసుకున్నా జుంటా తలొంచ లేదు.
Also Read : నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించం