Mynampalli Hanumantha Rao : హరీశ్ రావు ఆటలు సాగవు
మైనంపల్లి హన్మంతురావు
Mynampalli Hanumantha Rao : హైదరాబాద్ – బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి రాష్ట్ర ఆర్థిక , ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనంతకు తాను ట్రబుల్ షూటర్ అని విర్రవీగుతున్నాడని ధ్వజమెత్తారు. ఇక నుంచి ఆయన ఆటలు సాగవన్నారు మైనంపల్లి హన్మంతురావు.
Mynampalli Hanumantha Rao Serious Comments on Harish Rao
ఒకనాడు స్లిప్పర్లతో ఉన్న తన్నీరు హరీశ్ రావుకు ఇవాళ లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తను ఎక్కడికి వెళితే అక్కడ గెలిచి తీసుకు వస్తానన్న ధీమాతో ఉన్నారని కానీ మల్కాజ్ గిరి నియోజకవర్గంలో నడవదన్నారు.
తన్నీరు హరీశ్ రావును తప్పకుండా ఓడిస్తానని, ఎక్కడికి వెళ్లినా వదలనని హెచ్చరించారు మైనంపల్లి హన్మంతురావు(Mynampalli Hanumantha Rao). ఆనాడు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చి పోయాడని, ఈనాడు అధికారాన్ని, మామ సీఎం కేసీఆర్ ను అడ్డం పెట్టుకుని పవర్ ను చెలాయిస్తున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ జిమ్మిక్కులు తన వద్ద పని చేయవని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను చుక్కలు చూపించడం ఖాయమని హెచ్చరించారు మైనంపల్లి హన్మంతురావు.
Also Read : Chandrababu Support : చలో రాజమండ్రి ఉద్రిక్తం