Mynampally Hanumanth Rao : కేటీఆర్ బచ్చా జర జాగ్రత్త
మైనంపల్లి హనుమంత రావు
Mynampally Hanumanth Rao : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు(Mynampally Hanumanth Rao) నిప్పులు చెరిగారు. తన గురించి అవాకులు చెవాకులు పేలిన మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నువ్వు, నీ తండ్రి ఎన్ని వేషాలు వేసినా ఇక్కడ చెల్లదన్నారు.
Mynampally Hanumanth Rao Serious Comments on KTR
తాను ముందు నుంచి ఉద్యమంలో ఉన్నానని నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పాలన్నారు. తన గురించి ఇంకోసారి నోరు జారితే బాగుండదంటూ హెచ్చరించారు. నువ్వు ఎవరికీ తెలియకుండా బెంగళూరుకు ఎందుకు వెళుతున్నావో చెప్పమంటవా అని ప్రశ్నించారు.
నన్ను గూండా అంటావా..నీకు ఎంత ధైర్యం, బిడ్డా నాతో పెట్టుకుంటే మటాష్ అయి పోతవ్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశాడు మైనంపల్లి హనుమంత రావు.
బీజేపీని ఇక్కడ తిట్టి ఢిల్లీకి కాళ్లు పట్టుకునే నీకు, నీ తండ్రికి నన్ను విమర్శించే హక్కు లేదన్నారు. మల్కాజ్ గిరి, మెదక్ లో ఓడి పోతారనే భయంతోనే తనపై విమర్శలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
Also Read : Mansoor Ali Khan : కమిషన్ కన్నెర్ర ‘ఖాన్’ గాయబ్