Mynampally Hanumantha Rao : పంతం నెగ్గించుకున్న మైనంపల్లి
తండ్రీ కొడుకులకు రెండు సీట్లు
Mynampally Hanumantha Rao : తెలంగాణ – రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 119 సీట్లకు గాను 55 మంది అభ్యర్థులతో తొలి విడత జాబితాను విడుదల చేసింది ఏఐసీసీ. విచిత్రం ఏమిటంటే ఒకే కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వకూడదని ఇప్పటికే ఉదయ్ పూర్ లో జరిగిన డిక్లరేషన్ లో తీర్మానం చేసింది. కానీ దానికి తిలోదకాలు ఇచ్చింది.
Mynampally Hanumantha Rao Got an Offer as He Expected
తాజాగా భారత రాష్ట్ర సమితిలో కీలకమైన నాయకుడిగా, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు(Mynampally Hanumantha Rao) ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన కొడుక్కి సీటు ఇవ్వక పోవడాన్ని తప్పు పట్టారు. సీఎం కేసీఆర్ పై, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
గులాబీకి గుడ్ బై చెప్పారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఓ కండీషన్ పెట్టారు. చివరకు పార్టీ తల వంచింది. తనతో పాటు తన కొడుక్కి కూడా టికెట్ ఇప్పించు కోవడంలో సక్సెస్ అయ్యారని భావించక తప్పదు.
ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తండ్రీ కొడుకులకు టికెట్లు కేటాయించింది. మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హనుమంత రావు కు, కొడుక్కి మెదక్ నియోకవర్గంలో పోటీ చేసేలా ఛాన్స్ ఇచ్చింది. మొత్తంగా తాను అనుకున్న దానిని సాధించడంలో సక్సెస్ అయ్యాడు ఎమ్మెల్యే.
Also Read : Jayaho Bharat : మేరా భారత్ మహాన్
